75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-07T06:11:51+05:30 IST

రాష్ట్ర జాతీయత ఉట్టిపడేలా జిల్లావ్యాప్తంగా వజ్రోత్స వాలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు సూచిం చారు.

75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌ టౌన్‌, ఆగస్టు 6 : రాష్ట్ర జాతీయత ఉట్టిపడేలా జిల్లావ్యాప్తంగా వజ్రోత్స వాలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు సూచిం చారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రి జడ్పీ చైర్‌ పర్సన్‌, జిల్లా పాలనాధికారులతో కలిసి వజ్రోత్సవాల నిర్వహణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో పండగ వాతా వరణాన్ని కల్పించేందుకు వీలుగా ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకుంటూనే ప్రతి ఇంటి పైన జెండా ఆవిష్కరణలు గావించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 16వ తేదీన ఏకకాలంలో ఎక్కడివారు అక్కడ సామూహిక జాతీయ గీతాలాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. 17వ తేదీన రక్తదాన శిబి రాలను ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారి చర్యలు చేపట్టాలన్నారు. 18వ తేదీన క్రీడల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారికి సూ చించారు. 19న దవాఖానాలు, అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, జైలల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేపట్టాలని డీఈవోకు సూచించారు. 20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా ముగ్గుల పోటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నా రు. 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. 22న వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించు కోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మున్సిపల్‌ అధికారులు, సంబం ధిత అధికారులు, ఎంపీడీవో, ఎంపీవోలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఇంటింటికి జాతీయ జెండాను ఆవిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, 12న జాతీయ సమైక్య రక్షాబంధన్‌ రోజున టెలికాస్ట్‌ చేయాలని, రక్తదాన శిబిరం నిర్మల్‌, భైంసాలలో ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

సోన్‌, ఆగస్టు 6 : మండలంలోని సిద్దులకుంట గ్రామానికి చెందిన ఆత్మ చైర్మన్‌ గంగారెడ్డి కుమార్తె అశ్విత రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం మంత్రి అల్లోల ఇంద్రకర ణ్‌ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎఫ్‌ఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ లోలం శ్యామ్‌సుందర్‌, జడ్పీటీసీ జీవన్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోహి నొద్దీన్‌, తదితరులున్నారు. 

Updated Date - 2022-08-07T06:11:51+05:30 IST