దుబాయిలో తూర్పు గోదావరి చిన్నారి జాతీయ స్ఫూర్తి

ABN , First Publish Date - 2021-08-15T21:26:02+05:30 IST

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసులు గతంతో పోల్చితే ఈ సారి విభిన్నంగా జరుపుకోన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరిగిన జాతీయ స్ఫూర్తి కార్యక్రమా

దుబాయిలో తూర్పు గోదావరి చిన్నారి జాతీయ స్ఫూర్తి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసులు గతంతో పోల్చితే ఈ సారి విభిన్నంగా జరుపుకోన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరిగిన జాతీయ స్ఫూర్తి కార్యక్రమాలలో.. రాష్ట్ర గాన్ (జాతీయ గీతం) ఆలపన విదేశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఒక్క భారతీయుడు జాతీయ గీతాన్ని పాడి ఆప్‌లోడ్ చేయాల్సిందిగా భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు విదేశాలలోని భారతీయ ఎంబసీలు దీన్ని ఒక యజ్ఞంగా భావించాయి. యువతలో ప్రత్యేకించి విద్యార్ధులలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. దీంతో వేలాది మంది చిన్నారులు జాతీయ గీతాన్ని రికార్డు చేసి మురిసిపోయారు.



ఈ క్రమంలో దుబాయిలో పుట్టి పెరిగిన తూర్పు గోదావరి జిల్లా సఖీనేటిపల్లె మండలానికి చెందిన తొమ్మిదెళ్ళ చిన్నారి మరియా రాచెల్ జాతీయ గీతాన్ని ఆలపించి అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆలపించిన జాతీయ గీతానికి సంబంధించి రికార్డు ప్రవాసీయుల్లో చక్కర్లు కొడుతుంది. కాగా.. దుబాయిలోని ఇండియన్ హై స్కూల్లో నాల్గవ తరగతి చదువుతున్న మరియా.. బాబ్జి స్టెఫెన్ డానియల్, సుభాషిణిల కూతురు. ఈ సారి అత్యధిక మంది భారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రప్రథమంగా రికార్డు చేయగా దాన్ని అంసఖ్యాకులు విదేశాలలో పాటించారు. 


Updated Date - 2021-08-15T21:26:02+05:30 IST