754..ఉమ్మడి జిల్లాలో నమోదైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-15T09:30:02+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. శుక్రవారం 754 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

754..ఉమ్మడి జిల్లాలో నమోదైన కరోనా కేసులు

రంగారెడ్డి జిల్లాలో 412.. ఇద్దరు మృతి, మేడ్చల్‌లో 313.. ఒకరు మృతి,  వికారాబాద్‌లో 29 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. శుక్రవారం 754 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అధికంగా రంగారెడ్డి జిల్లాలో 412 నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 313 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. వికారాబాద్‌ జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 35,610కి చేరుకుంది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో 17 మందికి పాజిటివ్‌

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో శుక్రవారం 199 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆరుగురు షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన వారు కాగా ఆరుగురు కొత్తూర్‌ మండలం, మిగతా ఐదుగురు ఇతర మండలాలకు చెందిన వారున్నారని వివరించారు. 


యాచారంలో ఏడుగురికి పాజిటివ్‌ 

యాచారం : ప్రభుత్వాసుపత్రిలో 18మందికి కరోనా పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారిణి డాక్టర్‌ నాగజ్యోతి చెప్పారు. చింతపట్లలో ముగ్గురు, మంతన్‌గౌడ్‌లో ఒకరు, సరూర్‌నగర్‌కు చెందిన ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. 


చేవెళ్లలో  ఎనిమిది.. ఆమనగల్లులో ఐదు కేసులు

చేవెళ్ల/ ఆమనగల్లు: చేవెళ్ల ప్రభుత్వ సివిఎల్‌ ఆసుపత్రిలో 52 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేశారు. అందులో 8మందికి పాజిటివ్‌గా వచ్చిందని వైద్యుడు ప్రదీప్‌ తెలిపారు. ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రిలో 32 మందికి పరీక్షలు చేయగా వెంకటేశ్వర కాలనీకి చెందిన నలుగురికి, ఆదర్శ్‌నగర్‌ కాలనీకి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. 


శంషాబాద్‌లో నాలుగు పాజిటివ్‌లు

శంషాబాద్‌రూరల్‌/శంషాబాద్‌/కందుకూరు : శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ పీహెచ్‌సీలో 19 మందికి టెస్టులు చేయగా తొండుపల్లికి చెందిన ఇద్దరికి, పాల్మాకులలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిన్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే నర్కూడ పీహెచ్‌సీలో 24 మందికి టెస్టులు చేయగా మధురానగర్‌కు చెందిన  మహిళకు పాజిటివ్‌ వచ్చింది. శంషాబాద్‌ మధురానగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైనట్లు వైద్యులు తెలిపారు. కందుకూరు మండలంలో 11మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. 


వికారాబాద్‌ జిల్లాలో...

వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌లో 12, తాండూరులో 6, కొడంగల్‌లో 3, మర్పల్లిలో 2, బంట్వారంలో 2, ధారూరు, దోమ, బషీరాబాద్‌, కోట్‌పల్లిల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 751కు చేరుకోగా, యాక్టివ్‌ కేసులు 332 ఉన్నాయి. 31 మంది ఆసుపత్రుల్లో, 301 మంది హోంకేర్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 393 మంది రికవరీ కాగా, 26 మంది మృతి చెందారు. 

Updated Date - 2020-08-15T09:30:02+05:30 IST