మహిళ కడుపు నుంచి 74 రాళ్ల తొలగింపు

ABN , First Publish Date - 2022-05-27T11:47:08+05:30 IST

మహిళ కడుపు నుంచి 74 రాళ్ల తొలగింపు

మహిళ కడుపు నుంచి 74 రాళ్ల తొలగింపు

హైదరాబాద్ సిటీ/బోయిన్‌పల్లి : ఓ మహిళ (Women) కడుపు నుంచి 74 రాళ్లను (Stones) తొలగించారు. బోయిన్‌పల్లికి చెందిన ఓ మహిళ(44) కడుపునొప్పితో (stomach ache) బాధపడుతూ బోయిన్‌పల్లిలోని వీఆర్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది. ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ నందకిషోర్‌, డాక్టర్‌ భరత్‌ కుమార్‌తో పాటు వైద్యుల బృందం గురువారం ఆమెకు శస్త్ర చికిత్స చేసి కడుపులోని గాల్‌బ్లాడర్‌లో ఉన్న 74 చిన్నరాళ్లను తొలగించారు. ఒక్కొక్క రాయి రెండు గ్రాములు ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగుకావడంతో ఆమెను డిశ్చార్జి చేశారు.

Updated Date - 2022-05-27T11:47:08+05:30 IST