73వ ఏట డాక్టరేట్‌ పొందిన వృద్ధుడు

ABN , First Publish Date - 2021-12-17T16:04:25+05:30 IST

డాక్టరేట్‌ పొందిన వృద్ధుడు, చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు. కన్నియాకుమారి జిల్లా తిర్పరప్పు ప్రాంతానికి చెందిన తంగప్పన్‌ (73) అదే ప్రాంతంలోని దేవసం బోర్డుకు చెందిన పాఠశాలలో

73వ ఏట డాక్టరేట్‌ పొందిన వృద్ధుడు

                        - చదువుకు అడ్డుకాని వయస్సు


పెరంబూర్‌(చెన్నై): డాక్టరేట్‌ పొందిన వృద్ధుడు, చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు. కన్నియాకుమారి జిల్లా తిర్పరప్పు ప్రాంతానికి చెందిన తంగప్పన్‌ (73) అదే ప్రాంతంలోని దేవసం బోర్డుకు చెందిన పాఠశాలలో ఉపాధ్యాయుడుగాను, ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసి 15 ఏళ్ల క్రితం పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం తనకు సొంతమైన పొలంలో జీడిపప్పు సాగును చేస్తున్న తంగప్పన్‌ డాక్టరేట్‌ పట్టా పొందాలనుకున్నాడు. గాంధీజీ ఆశయాలతో జీవించే తంగప్పన్‌, డాక్టరేట్‌ పట్టా కోసం మనోన్మణియం సుందరనార్‌ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసుకున్నారు. కుట్రాలం పరాశక్తి కళాశాల ప్రొఫెసర్‌ కనకాంబాళ్‌ మార్గదర్శకంలో తన పరిశోధనలను ప్రారంభించారు. ‘గాంధీయ తత్వం-నేటి తీవ్రవాద ప్రపంచంలో ఎంత ముఖ్యత్వం’ అనే అంశంపై ఏడేళ్లు పరిశోధనలు చేపట్టి ప్రమాణపత్రం దాఖలు చేసిన తంగప్పన్‌, ఇటీవల గవర్నర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకున్నాడు. తంగప్పన్‌ ఇదివరకే ఎంఏ (చరిత్ర), ఎంఎడ్‌, ఎంఫిల్‌ తదితర కోర్సులు పూర్తిచేశారు. వివాహం చేసుకోని ఆయన జీవితమంతా చదువుతూ ఉండాలని, గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలతో జీవించాలనే కోరికతో ఉన్నారు.

Updated Date - 2021-12-17T16:04:25+05:30 IST