73 మందికి పాజిటివ్‌: ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-25T07:37:35+05:30 IST

జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 73 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

73 మందికి పాజిటివ్‌: ఒకరి మృతి

తిరుపతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 73 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అదే సమయంలో కొవిడ్‌తో ఒకరు మృతిచెందారు. తాజా కేసులతో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 246419కు, కొవిడ్‌ మరణాలు 1941గా చేరాయి. ఆదివారం ఉదయానికి యాక్టివ్‌ కేసులు 963గా ఉన్నాయి. తాజా కేసులు.. తిరుపతి అర్బన్‌లో 8. చిత్తూరులో 6, తిరుపతి రూరల్‌ 7, చంద్రగిరి, మదనపల్లె మండలాల్లో 4 చొప్పున, కలికిరి, సదుం, పులిచెర్ల మండలాల్లో 3 వంతున, శ్రీకాళహస్తి, పీలేరు, కంభంవారిపల్లె, చినగొట్టిగల్లు, పాకాల, రేణిగుంట, జీడీ నెల్లూరు, బంగారుపాళ్యం, నారాయణవనం, తవణంపల్లె, ఆర్సీపురం, రామసముద్రం మండలాల్లో 2 చొప్పున, పెదమండ్యం, గుర్రంకొండ, రొంపిచెర్ల, కురబలకోట, తొట్టంబేడు, చౌడేపల్లె, ఏర్పేడు, పుత్తూరు, గంగవరం, బి.కొత్తకోటలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 


11 మంది కరోనా బాధితుల డిశ్చార్జి

తిరుపతి సిటీ: స్విమ్స్‌, రుయాస్పత్రుల నుంచి ఆదివారం కొవిడ్‌ నుంచి కోలుకున్న 11 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. వీరిలో స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో ఆరుగురున్నారు. మరో 44 మంది కరోనాతో, 17 మంది బ్లాక్‌ ఫంగ్‌సతో చికిత్స పొందుతున్నారని స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. రుయాలో ఐదుగురు డిశ్చార్జి కాగా, 35 మంది కరోనాతో, 12 మంది బ్లాక్‌ ఫంగ్‌సతో చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి తెలిపారు.

Updated Date - 2021-10-25T07:37:35+05:30 IST