వికారాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్‎లో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-01-26T16:04:56+05:30 IST

జిల్లాలోని ఎస్పీ కార్యాలయం పోలీసు పరేడ్ గ్రౌండ్‎లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ నారాయణ....

వికారాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్‎లో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

వికారాబాద్: జిల్లాలోని ఎస్పీ కార్యాలయం పోలీసు పరేడ్ గ్రౌండ్‎లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, జిల్లా అడిషనల్ కలెక్టర్‎లు మోతిలాల్, చెంద్రయ్య , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, అధికారులు స్వీకరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ..పాఠశాల బాలబాలికలు చేసిన విన్యాసములు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పౌసుమి బసు తెలిపారు.

Updated Date - 2021-01-26T16:04:56+05:30 IST