తల్లి పట్ల క్రూరత్వం.. ఏళ్ల పాటు ఇంట్లోనే బంధించిన వైనం.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-25T07:40:02+05:30 IST

నవ మాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఆ ఇద్దరూ కొడుకులు క్రూరంగా వ్యవహరించారు.. మానవత్వం మరిచిపోయి ఆమెకు బతికి ఉండగానే నరకం చూపించారు.. పదేళ్ల పాటు ఆమెను ఇంట్లో బంధీగా ఉంచారు.. వారానికి ఒకసారి మాత్రమే భోజనం అందించేవారు.. కొడుకుల కర్కశత్వానికి బలైన ఆ 72 ఏళ్ల మహిళ పక్కింటి...

తల్లి పట్ల క్రూరత్వం.. ఏళ్ల పాటు ఇంట్లోనే బంధించిన వైనం.. చివరకు..

నవ మాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఆ ఇద్దరూ కొడుకులు క్రూరంగా వ్యవహరించారు.. మానవత్వం మరిచిపోయి ఆమెకు బతికి ఉండగానే నరకం చూపించారు.. పదేళ్ల పాటు ఆమెను ఇంట్లో బంధీగా ఉంచారు.. వారానికి ఒకసారి మాత్రమే భోజనం అందించేవారు.. కొడుకుల కర్కశత్వానికి బలైన ఆ 72 ఏళ్ల మహిళ పక్కింటి వారి సహకారంతో ఇటీవల బయటకు వచ్చింది.. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటోంది. 


తమిళనాడులోని చెన్నైకు చెందిన 72 ఏళ్ల జ్ఞానజ్యోతి (72) అనే మహిళను ఆమె ఇద్దరు కుమారులు గత పదేళ్లుగా ఇంట్లో బంధించి ఉంచారు. ఆమె కొడుకుల్లో పెద్దవాడు అయిన షణ్ముగసుందరన్‌ రిటైర్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ కాగా, చిన్న కొడుకు వెంకటేశన్‌ దూరదర్శన్ ఉద్యోగి. అయినా వారు తమ తల్లి బాగోగులను పట్టించుకోలేదు. జ్ఞానజ్యోతి మహిళ చనిపోయిన తరువాత ఆమె తన కూతురు వద్దనే ఉండేది. కానీ ఆమె కూతురు కూడా ఒక ప్రమాదంలో చనిపోయింది. ఆ తరువాత నుంచి ఇద్దరు కొడుకులు ఆమెను పట్టించుకోలేదు. అయితే ఆమె చిన్న కొడుకు ఉద్యోగ రీత్యా వేరే ఊరికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తల్లిని పెద్ద కొడుకు ఇంట్లోని ఒక గదిలో బంధించి పెట్టాడు. ఆమెకు వారానికి ఒకసారి మాత్రమే తల్లికి బిస్కెట్లు, రోటీలు ఇచ్చేవాడు. మిగిలిన రోజుల్లో ఆమె పక్కింటి వారు ఆహారం ఇస్తే తినేది. లేకపోతే లేదు. దీంతో ఆమె ఆరోగ్యం బాగా క్షిణించింది. ఈ విషయం తెలిసి కూడా చిన్న కొడుకు పట్టించుకోలేదు.


పదేళ్లుగా ఇంట్లోనే బంధీగా ఉండడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి గమనించిన ఇరుగుపొరుగు వారు శుక్రవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళా సిబ్బంది పోలీసులతో కలిసి కావేరీ నగర్‌లోని మహిళ నివాసానికి చేరుకున్నారు. ఆమెను బయటకు తీసుకు వచ్చి హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ ఇద్దరు కొడుకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ ప్రతినిధులు చెప్పారు.


Updated Date - 2022-04-25T07:40:02+05:30 IST