72 గంటల సమ్మె సక్సెస్‌

ABN , First Publish Date - 2020-07-05T10:45:00+05:30 IST

సింగరేణిలో 72 గంటల సమ్మె విజయవంతంగా ముగిసింది. సిం గరేణి కార్మికులు దేశంలోని బొగ్గుగని కార్మిక వర్గంతో కలిసి మూడు రోజులు ఐక్యంగా సమ్మెలో పాల్గొన్నందు కు కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

72 గంటల సమ్మె సక్సెస్‌

ఏకతాటిపై నిలిచిన సింగరేణి కార్మికులు

జాతీయ సంఘాల నేతల కృతజ్ఞతలు

బొగ్గుబ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట కొనసాగుతుందన్న నాయకులు

 

మంచిర్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : సింగరేణిలో 72 గంటల సమ్మె విజయవంతంగా ముగిసింది. సిం గరేణి కార్మికులు దేశంలోని బొగ్గుగని కార్మిక వర్గంతో కలిసి మూడు రోజులు ఐక్యంగా సమ్మెలో పాల్గొన్నందు కు కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. బొగ్గుబ్లాక్‌ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాటను కొనసాగి స్తామని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. సింగరేణిని పరిరక్షించుకునే గురుతరమైన బాధ్యత తమపై ఉందని ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బి. జనక్‌ప్రసాద్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, బీఎంఎస్‌ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, సీఐటీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు టి. శ్రీనివాస్‌, జాతీయ ఐఎ్‌ఫ్‌టీయూ నేత ఎస్‌.వెంకటేశ్వర్లు,  టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ ప్రకటించారు. నాయకుల అరెస్టులను ఖండించారు. సమ్మెలో ఒక్కరోజు మాత్రమే పాల్గొని  కార్మికులను గందరగోళానికి గురిచేసే విధంగా  విధులు నిర్వహించిన టీబీజీకేఎస్‌ నేతల నిర్ణయాన్ని నాయకులు విచ్ఛిన్నకరమైన చర్యలుగా పేర్కొన్నారు. 


72 గంటలు కథంతొక్కిన నల్లసూర్యులు... 

బొగ్గుబ్లాక్‌లను ప్రైవేటుపరం చేసి వేలం వేయడానికి నిర్ణయం తీసుకొన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి, కోల్‌ ఇండియాలో 72 గంటల సమ్మె శనివారం విజయవంతంగా ముగిసింది. సింగరేణి పరిధిలోని 11 ఏరియాలలో గల 45 బొగ్గుబావులలో 28 డిపార్ట్‌మెంట్లలో శనివారం 77 శాతం కార్మికులు విధుల ను బహిష్కరించారు. మొదటి రోజు మాత్రమే సమ్మెకు మద్దతిచ్చిన టీబీజీకేఎస్‌ తమ కార్యకర్తలుగా ఉన్న కార్మికులను విఽధులకు హాజరుకావాలని కోరడంతో కొంద రు విధులు నిర్వహించినప్పటికీ ఉత్పత్తి లక్ష్యం నెరవే రలేదు. మెజార్టీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.


శని వారం రామకృష్ణాపూర్‌, శ్రీరాంపూర్‌లలోనూ, బెల్లంపల్లి, మందమర్రిలోనూ ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. కార్మిక నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు, రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లిలలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలలో  పాల్గొ న్నారు. కాగా సమ్మె పరిస్థితి, కొవిడ్‌-19 నేపథ్యంలో సింగరేణి ఆసుపత్రులను డైరెక్టర్‌ ఆపరేషన్స్‌  అండ్‌ పర్సనల్‌ ఎస్‌. చంద్రశేఖర్‌, సీఎంఓ డా. మాంత శ్రీనివాస్‌ తదితరులు రామకృష్ణాపూర్‌లో సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.


రూ.110 కోట్ల నష్టం...  

సమ్మె వల్ల మూడు రోజులలో సింగరేణికి సంబం ధించి రూ.110 కోట్ల రెవెన్యూ దెబ్బతిన్నది. యార్డ్‌లలో ఉన్న బొగ్గును రవాణా చేశారు. కార్మికులు మూడు రోజులలో రూ.40 కోట్ల వరకు వేతనాలను కోల్పోయారు.  కోల్‌ ఇండియాలోని ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్ర దేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలలోనూ 2 లక్షల 75 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో కేంద్రంపై ఒత్తిడి పడింది.  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా తడోబాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందర్‌ బ్లాక్‌ను ఆదివాసీల పోరాట ఫలితంగా వేలం నుంచి తప్పించినట్లు సమాచారం. సమ్మె ఫలితంగా 41 బ్లాక్‌ల కు వేసిన  వేలం బిడ్‌లను ఇంకా కేంద్ర ప్రభుత్వం తెరవనట్లు సమాచారం. 

Updated Date - 2020-07-05T10:45:00+05:30 IST