వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో 72 కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2020-10-01T08:03:20+05:30 IST

లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జిల్లా కోర్టులో నిర్వహించిన వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా 72

వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో 72 కేసులు పరిష్కారం

నాల్గో అదనపు జిల్లా జడ్డి శ్రీనివాసరావు 


కాకినాడ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జిల్లా కోర్టులో నిర్వహించిన వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా 72 కేసులు పరిష్కరించామని నాలుగో అదనపు జిల్లా జడ్డి ఎన్‌.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.


ఇందుకు నాలుగు బెంచ్‌లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. మొదటి బెంచ్‌కు తాను, రెండో బెంచ్‌కు 3వ అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.మల్లీశ్వరి ప్రాతినిథ్యం వహించారన్నారు. మూడో బెంచ్‌కు 5వ అడిషనల్‌ జేఎఫ్‌సీ మేజిస్ర్టేట్‌ ఎల్‌.శారదారెడ్డి, నాలుగో బెంచ్‌కు స్పెషల్‌ మొబైల్‌ జేఎఫ్‌సీ మేజిస్ర్టేట్‌ సి.జానకి తీర్పులు ఇచ్చారన్నారు.  

Updated Date - 2020-10-01T08:03:20+05:30 IST