సొంతింటిపై బండ

ABN , First Publish Date - 2020-07-04T10:11:27+05:30 IST

పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. టిడ్కో ఇళ్లకు మంగళం పాడింది. గత ప్రభుత్వ

సొంతింటిపై బండ

టిడ్కో గృహాలకు మంగళం

జిల్లాలో 7184 ఇళ్లు రద్దు

ప్రభుత్వం తాజా నిర్ణయం

డిపాజిట్లు వెనక్కిచ్చేందుకు చర్యలు

పేద లబ్ధిదారుల ఆవేదన


అనంతపురం, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. టిడ్కో ఇళ్లకు మంగళం పాడింది. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో టిడ్కో ద్వారా ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులను భాగస్వాములను చేస్తూ వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 2018 లో జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.


ఆ సం దర్భంగా అనంతపురం నగరపాలక సంస్థతో పాటు తాడిపత్రి, హిందూపురం, కదిరి, గుంత కల్లు, రాయదుర్గం, ధర్మవరం మున్సిపాలిటీలు, పుట్టపర్తి, గుత్తి, పామిడి నగర పంచాయతీల్లో లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించి, నిర్మాణాలు చేపట్టారు.  గతేడాది  వైసీపీ  అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదా పు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టిడ్కో ఆధ్వర్యంలో చేప ట్టిన నిర్మాణాల్లో.. పునాది దశలో ఉన్న వాటిని రద్దు చే యాలనేది ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే జిల్లాలో 7184 ఇళ్లను రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రద్దయిన ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల డిపాజిట్లను తిరిగి వెనక్కు ఇవ్వాలని సంబం ధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం త్వరలో 1.2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపి ణీ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. 


ప్రస్తుతం టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్లు ఏవైతే రద్దయ్యాయో ఆ లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించనున్నట్లు జిల్లా యంత్రాంగం ద్వారా అందిన సమాచారం. అయితే ఇంటి స్థలాల పంపిణీ కంటే టిడ్కో గృహాలవైపే లబ్ధిదా రులు మొగ్గుచూపుతున్నారు. ఎక్కడో జనావాసాలకు దూ రంగా స్థలాలిచ్చినా పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఎంత కాలం పడుతుందోనన్న సందేహం ఆ వర్గాల నుం చి వ్యక్తమవుతోంది. 


జిల్లాలో కేటగిరీల వారీగా రద్దయిన టిడ్కో గృహాలు....

జిల్లాలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని అ నంతపురం నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చేపట్టిన టిడ్కో ఇళ్లకు సంబంధించి మొత్తంగా 7184 ఇళ్లను రద్దు చేశారు. ప్రధానంగా 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో ఆ మూడు కేటగిరీల వారీగా పరిశీలిస్తే.... 300చదరపు అడుగులకు సంబంధించి 1472 ఇళ్లను రద్దు చేయగా... అందులో తాడిపత్రిలో 512, పుట్టపర్తిలో 288, కదిరిలో 96, హిందూపురంలో 384, గుత్తిలో 192 ఇళ్లు ఉన్నాయి. 365 చదరపు అడుగులకు సంబంధించి 3456 ఇళ్లను రద్దు చేయగా అందులో అనంతపురం నగరపాలక సంస్థల పరిధిలో 1008, తాడిపత్రిలో 240, గుంతకల్లులో 144, పుట్టపర్తిలో 288, పామిడిలో 720, కదిరిలో 48, హిందూపురంలో 960, గుత్తిలో 48 ఇళ్లు ఉన్నాయి. 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి మొత్తంగా 2256 ఇళ్లు రద్దు చేయగా అందులో అనంతపురం నగరపాలక సంస్థలో 1056, తాడిపత్రిలో 384, రాయదుర్గంలో 48, గుంతకల్లులో 192, పుట్టపర్తిలో 144, పామిడిలో 144, కదిరిలో 48, హిందూపురంలో 192, గుత్తిలో 48 ఇళ్లు ఉన్నాయి. 

 

మున్సిపాలిటీ/ ఇళ్ల నిర్మాణం 300చ.అ 365 చ.అ 430చ.అ మొత్తం

నగర పంచాయతీ చేపట్టిన ప్రాంతం

అనంతపురం కార్పొరేషన్‌ పండమేరు --- 1008 1056 2064

తాడిపత్రి గన్నేవారుపల్లి 512 240 384 1136

రాయదుర్గం మల్లాపురం --- --- 48 48

గుంతకల్లు దోనిముక్కల --- 144 192 336

పుట్టపర్తి కర్నాటక నాగేపల్లి 288 288 144 720

పామిడి వీకేఏరెడ్డి కాలనీ --- 720 144 864

కదిరి హిందూపురం రోడ్డు 96 48 48 192

హిందూపురం కొటిపి 384 960 192 1536

గుత్తి నేమతాబాద్‌ రోడ్డు 192 48 48 288

ధర్మవరం రేగాటిపల్లి ---- --- --- ---

మొత్తం 1472 3456 2256 7184

  

జిల్లాలో రద్దయిన టిడ్కో గృహాలివీ....

 

ప్రాంతం పేరు మొత్తం రద్దయిన 

గృహాలు గృహాలు

అనంతపురం 4464 2064

తాడిపత్రి 6320 1136

రాయదుర్గం 1056 48

గుంతకల్లు 2496 336

పుట్టపర్తి 1008 720

పామిడి 2208 864

కదిరి 1296 192

హిందూపురం 2736 1536

గుత్తి 384 288

ధర్మవరం 1440 ------

మొత్తం 23408 7184


రూ. 11 కోట్ల దాకా డిపాజిట్లు వెనక్కి

జిల్లాలో రద్దయిన 7184 మంది లబ్ధిదారులు చెల్లించిన రూ. 11 కోట్లదాకా డిపాజిట్లను ప్రభుత్వం వెనక్కు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో రద్దయిన టిడ్కో ఇళ్లను పరి శీలిస్తే.... 300 చదరపు అడుగులకు సంబంధించి 1472 మంది లబ్ధిదారులు రూ. 500 చొప్పున చెల్లించారు. ఈ లెక్కన వారికి రూ. 7,36,000లు  ప్రభుత్వం తిరిగి చెల్లిం చాల్సి ఉంది.  365 చదరపు అడుగులకు సంబంధించి 3456 మంది లబ్ధిదారులు రూ. 12,500 చొప్పున చెల్లిం చారు.


ఈ లెక్కన వారికి రూ. 4.32 కోట్లు చెల్లించాలి.  400 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి 2256 మంది లబ్ధిదారులు రూ. 25 వేల చొప్పున డిపాజిట్లు చెల్లించారు. ఈ లెక్కన ఆ లబ్ధిదారులకు రూ. 5.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. త్వరలో ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు చెల్లించను న్నారు. టిడ్కో నిబంధనల మేరకు 300 చదరపు అడుగుల ఇంటి కోసం లబ్ధిదారుడు రూ. 500 మాత్రమే చెల్లించాలి. అదే 365 చదరపు అడుగుల ఇంటి కోసమైతే రూ. 50 వేలు రూ. 12500 చొప్పున రెండు కంతులుగా చెల్లించాలి. 465 చదరపు అడుగుల ఇంటి కోసమైతే లబ్ధిదారుడు రూ. లక్ష చెల్లించాలి. అందులోనూ నాలుగు కంతుల రూపంలో కంతుకు రూ. 25 వేలు చొప్పున చెల్లించాలి. కాగా... రద్దయిన ఇళ్లకు సంబంధించి కొందరు రూ. 50 వేలు, మరికొందరు రూ. 75 వేలు, ఇంకొందరు రూ. లక్ష కూడా చెల్లించినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. ఈ లెక్కన ఇళ్లు రద్దయిన వారందరికీ త్వరలో డిపాజిట్లు చెల్లించనున్నారు. 


లబ్ధిదారుల్లో ఆందోళన....

టిడ్కో ఇళ్లను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈపాటికి ఎప్పుడో పూర్తయ్యే వని నగరానికి చెందిన ఓ లబ్ధిదారుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఎదురుచూసిన పాపానికి ఇదా బహుమతి అంటూ నిట్టూర్చారు. ఎంతో ఆశతో పైసా పైసా కూడబెట్టుకుని డబ్బులు కడితే చివరికి వెనక్కు ఇస్తామని ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పినట్లుగా ఉందంటూ ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. డిపాజిట్లకు వడ్డీ చెల్లిస్తారా అనే ప్రశ్న కొందరి నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం. 


అనంత కార్పొరేషన్‌లో టిడ్కో ఇళ్ల రద్దు పునఃపరిశీలనకు ప్రతిపాదనలు

అనంతపురం నగర పరిధిలో నివాసముంటున్న 4464 మంది ఇళ్లులేని సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించారు. తాజాగా... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు.. 2064 ఇళ్లు రద్దు చేశారు. ఆ ఇళ్ల రద్దును పునఃపరిశీలించాలని నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని యోచిస్తున్నట్లు ఆ కార్యాలయ వర్గాల ద్వారా అందిన స మాచారం. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇళ్ల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-07-04T10:11:27+05:30 IST