2021లో కువైట్ నుంచి 70 వేల మంది ప్రవాసులు వెనక్కి!

ABN , First Publish Date - 2020-11-29T15:03:09+05:30 IST

60 ఏళ్లకు పైబడిన ప్రవాస కార్మికులకు వచ్చే ఏడాది నుంచి వర్క్ వీసా రెన్యూవల్ ఉండదని కువైట్ సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానుంది.

2021లో కువైట్ నుంచి 70 వేల మంది ప్రవాసులు వెనక్కి!

కువైట్ సిటీ: 60 ఏళ్లకు పైబడిన ప్రవాస కార్మికులకు వచ్చే ఏడాది నుంచి వర్క్ వీసా రెన్యూవల్ ఉండదని కువైట్ సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానుంది. దీంతో 2021లో 60 ఏళ్లకు పైబడిన సుమారు 70 వేల మంది ప్రవాసులు వెనక్కి రానున్నారు. కువైటైజేషన్, దేశంలో జనాభా సమతుల్యతను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా విదేశీయుల నియామకాన్ని తగ్గించడమే దీనికి కారణం. దీనిలో భాగంగానే కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ 60 ఏళ్లు నిండినవారికి రెసిడెన్సీ అనుమతుల పునరుద్ధరణను నిషేధించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే 60 ఏళ్లు పైబడిన ప్రవాసుల జాబితాలను రెడీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కువైట్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్... 60 ఏళ్లు నిండిన ప్రవాసులకు దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ఒకటి నుంచి మూడు నెలల గడువిచ్చింది.   

Updated Date - 2020-11-29T15:03:09+05:30 IST