ఉక్రెయిన్‌లో 70 టార్గెట్లను ధ్వంసం చేశాం: రష్యా

ABN , First Publish Date - 2022-02-25T01:56:51+05:30 IST

ఉక్రెయిన్‌లో మిలిటరీ ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగుతోందని రష్యా గురువారం ప్రకటించింది. ఉక్రెయిన్‌పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌కు తానే నిర్ణయం తీసుకున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కాగా, గురువారం వేకువజామునే..

ఉక్రెయిన్‌లో 70 టార్గెట్లను ధ్వంసం చేశాం: రష్యా

మాస్కో: ఉక్రెయిన్‌లో మిలిటరీ ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగుతోందని రష్యా గురువారం ప్రకటించింది. ఉక్రెయిన్‌పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌కు తానే నిర్ణయం తీసుకున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కాగా, పుతిన్ ప్రకటన అనంతరం యుద్ధం ప్రారంభించిన రష్యా సైన్యం ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లోని 70 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దు వెంట రష్యా 1,50,000 నుంచి 2,00,000 సైన్యాన్ని మోహరించినట్లు రష్యా తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేంత వరకు ఈ యుద్ధం కొనసాగించాలని రష్యా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


కాగా, రష్యా దండయాత్రపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొకవైపు అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొడతామని యూరోపియన్ యూనియన్ గురువారం సాయంత్రం ప్రకటించింది. యుద్ధానికి కంటే ముందే అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. వాటికి అనుగుణంగా గురువారం మరిన్న ఆంక్షలు విధించాయి. ఈ విషయమై నాటో, యూరోపియన్ యూనియన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాయి.

Updated Date - 2022-02-25T01:56:51+05:30 IST