బ్యాంకులకు 70కోట్ల టోపీ..12చోట్ల సీబీఐ సోదాలు

ABN , First Publish Date - 2021-12-04T07:52:38+05:30 IST

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కుచ్చుటోపీ పెట్టి రూ.70 కోట్లు మోసం చేసిన కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు.

బ్యాంకులకు 70కోట్ల టోపీ..12చోట్ల సీబీఐ సోదాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కుచ్చుటోపీ పెట్టి రూ.70 కోట్లు మోసం చేసిన కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు రూ.62 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కేసులో.. నంది గ్రైన్‌, ఎస్పీవై ఆగ్రో కంపెనీల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఆ కంపెనీల డైరెక్టర్లు సురేశ్‌ కుమార్‌ శాస్ర్తి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, శశిరెడ్డిల ఇళ్లలో తనిఖీలు చేసిన అధికారులు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, కర్నూల్‌, నంద్యాలలో సోదాలు చేసినట్లు సీబీఐ తెలిపింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.8 కోట్ల మోసానికి పాల్పడ్డ మరో కేసులో.. ఆరు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. పృథ్వీరాం ఇన్ర్ఫా, నవేవా ఎంవీరో, లోర్వాన్‌ గ్రిన్‌ ఎనర్జీ కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.   

Updated Date - 2021-12-04T07:52:38+05:30 IST