7 రాష్ట్రాల్లో కొత్తగా 90 శాతం కోవిడ్ కేసులు నమోదు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ABN , First Publish Date - 2021-02-26T00:52:23+05:30 IST

7 రాష్ట్రాల్లో కొత్తగా 90 శాతం కోవిడ్ కేసులు నమోదు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

7 రాష్ట్రాల్లో కొత్తగా 90 శాతం కోవిడ్ కేసులు నమోదు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: 7 రాష్ట్రాల్లో కొత్తగా 90శాతం కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో గురువారం నమోదైన కొత్త కేసుల్లో ఏడు రాష్ట్రాల్లో 89.57 శాతంగా నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 8,807 కేసులు నమోదయ్యాయి. కేరళ (4,106), పంజాబ్ (558), తమిళనాడు (463), గుజరాత్ (380), మధ్యప్రదేశ్ (344), కర్ణాటక (334) కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 16,738 కొత్తగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.


మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-02-26T00:52:23+05:30 IST