ఏడు దుకాణాల్లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-12-27T14:56:50+05:30 IST

ఈరోడ్‌ బస్టాండు సమీపంలో కట్టడ నిర్మాణపు పరికరాలను విక్రయించే దుకాణాలు, టింబర్‌షాపులు సహా ఏడు దుకాణాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాల్లోని రూ.25. కోట్ల విలువైన వస్తువులు కాలి

ఏడు దుకాణాల్లో అగ్నిప్రమాదం

                           - రూ 2.5 కోట్ల ఆస్తి నష్టం


చెన్నై: ఈరోడ్‌ బస్టాండు సమీపంలో కట్టడ నిర్మాణపు పరికరాలను విక్రయించే దుకాణాలు, టింబర్‌షాపులు సహా ఏడు దుకాణాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాల్లోని రూ.25. కోట్ల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. బస్టాండు సమీపం శక్తిరోడ్డు కూడలి వద్ద రామచంద్రన్‌ (57), శ్రీధర్‌ (47) అనే వ్యాపారులు కట్టడ నిర్మాణానికి ఉపయోగించే పెయింట్లు, ఇనుప కిటికీలు, తలుపులు, ఎలక్ట్రికల్‌ సామగ్రి, టైల్స్‌, స్నానపు గదులకు సంబంధించిన శానిటరీ పరికరాలు విక్రయించే దుకాణాలను, గోదాములను నడుపుతున్నారు. ఆదివారం వేకువజామున ఆ దుకాణాల్లో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపకదళం అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకునే లోపునే పది అడుగుల ఎత్తుకు మంటలు చెలరేగి ఐదు దుకాణాలలోని వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపకదళం సభ్యులు దుకాణాల తలుపులను పగులగొట్టి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా పోరాడారు. ఈ దుకాణాలకు పక్కనే ఉన్న టింబర్‌ డిపోలకు కూడా మంటలు వ్యాపించాయి. రెండు టింబర్‌ డిపోలోలని కొయ్య దుంగలన్నీ కాలి బూడిదయ్యాయి. నాలుగు ఫైరింజన్లతోనూ ప్రైవేటు వాటర్‌ ట్యాంకర్‌ లారీల ద్వారాను నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పివేశారు. ఈరోడ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను కనుగొనేలా దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2021-12-27T14:56:50+05:30 IST