పోలీసుల రైడింగ్: పట్టుబడ్డ ఏడుగురు పోలీసులు

ABN , First Publish Date - 2020-10-29T01:49:02+05:30 IST

అరెస్ట్ చేసిన అనంతరం వారిపై కర్ణాటక పోలీస్ చట్టం సెక్షన్ 79, సెక్షన్ 80 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు దక్షిణ మండల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరీష్ పాండే తెలిపారు. ‘‘ఐపీఎల్ నేపథ్యంలో పోలీసులు శాఖకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

పోలీసుల రైడింగ్: పట్టుబడ్డ ఏడుగురు పోలీసులు

బెంగళూరు: జూదం ఆడుతున్న ఏడుగురు పోలీసులను నగర పోలీసులు పట్టుకున్నారు. ఐపీఎల్ నేపధ్యంలో పోలీసులకు జూదంపై ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఇందులో భాగంగా రైడ్లు నిర్వహించిన పోలీసులకు ఓ హోటల్‌లో ఆన్‌లైన్‌లో జూదం ఆడుతున్న ఏడుగురు పోలీసులు పట్టుబడ్డారు. నగరంలోని పుట్టనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జూపీ నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. జేపీ నగర్‌లో ఉన్న నందిని హోటల్ కేంద్రంగా వీరు ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.


అరెస్ట్ చేసిన అనంతరం వారిపై కర్ణాటక పోలీస్ చట్టం సెక్షన్ 79, సెక్షన్ 80 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు దక్షిణ మండల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరీష్ పాండే తెలిపారు. ‘‘ఐపీఎల్ నేపథ్యంలో పోలీసులు శాఖకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. బెట్టింగ్, జూదం లాంటివి ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైడ్లు నిర్వహించాం. ఆ రైడ్లలో ఏడుగురు పోలీసులు పట్టుబడ్డారు. వారిని ప్రస్తుతం సస్పెండ్ చేశాం’’ అని హరీష్ పాండే అన్నారు.

Updated Date - 2020-10-29T01:49:02+05:30 IST