Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏడు నెలల పసివాడని కూడా చూడకుండా.. వేడి వేడి రాడ్డుతో వాత పెట్టిన తల్లి

ఏడు నెలల పసివాడని కూడా చూడకుండా తన సొంత బిడ్డను ఒక తల్లి వేడి వేడి రాడ్డుతో వాత పెట్టించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా నగరంలో జరిగింది. ఆ పసివాడి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పోలీసుల ఆ పసివాడి తల్లిదండ్రుల వాంగ్మూలం తీసుకున్నారు. 


పోలీసుల కథనం ప్రకారం.. భిల్వారా నగరంలో నివసించే దంపతులకు ఏడు నెలల కొడుకు ఉన్నాడు. బాబుకి ఊపిరి తీసుకునే సమస్య ఉండడంతో అతడిని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు. అతను బాబుకు మొదట తాయత్తులు కట్టమని ఇచ్చాడు. అవి కడితే నయమవుతుందని చెప్పాడు. కానీ దానివల్ల ఉపయోగం లేకపోవడంతో వాళ్లు మళ్లీ బాబుని తీసుకొని అదే బాబా వద్దకు వెళ్లారు.


ఈసారి ఆ బాబా జబ్బు బాగా ముదిరిందని చెప్పాడు. దానిని నయం చేయాలంటే వేడి వేడి రాడ్డుతో బాబు ఛాతిపై వాత పెట్టాలని చెప్పాడు. అందుకు ముందు భయపడినా చుట్టు పక్కల వాళ్లు ఏమీ కాదు అని నచ్చజెప్పారు. అందుకు ముందుగా బాబు తల్లి ఒప్పుకొని బాబాను అలాగే చేయమని కోరింది. దాంతో ఆ బాబా ఆ పసివాడి ఛాతీపై వేడి వేడి రాడ్డుతో వాత పెట్టాడు. సాయంత్రానికి బాబు పరిస్థితి విషమించడంతో ఆ తల్లిదండ్రలు ఆస్పత్రికి తీసుకువచ్చారు. మూఢనమ్మకంతో తమ పిల్లలకు ఇలాంటి క్రూరమైన చికిత్సలు చేయించే తల్లిదండ్రులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారనే దానికి ఈ సంఘటన ఓ నిదర్శనం.


పోలీసులు ఆ బాబాను అరెస్టు చేయడానికి వెళ్లగా అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement