కరోనా ఎఫెక్ట్.. 7 లక్షల ఉద్యోగాలు హుష్ కాకి!

ABN , First Publish Date - 2020-04-05T02:22:54+05:30 IST

అమెరికా ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వేలాది మరణాలతో చిగురుటాకులా వణుకుతోంది. మరోవైపు, లక్షలాది ఉద్యో

కరోనా ఎఫెక్ట్.. 7 లక్షల ఉద్యోగాలు హుష్ కాకి!

వాషింగ్టన్: అమెరికా ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వేలాది మరణాలతో చిగురుటాకులా వణుకుతోంది. మరోవైపు, లక్షలాది ఉద్యోగాలు ఊడుతున్నాయి. మార్చి నెల తొలి రెండు వారాల్లో యాజమాన్యాలు ఏకంగా 7 లక్షల మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు ట్రంప్ ప్రభుత్వం నివేదించింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉన్న 2009లో 8 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితికి చేరువైంది.


ముఖ్యంగా రెస్టారెంట్లు, బార్లలో ఎక్కువ ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో రిటైలర్ల రంగం ఉంది. ఇక, నిరుద్యోగ శాతం 3.5 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. ఉద్యోగాల క్షీణత ఈ స్థాయిలో పడిపోవడం ఈ దశాబ్దంలోనే ఇది తొలిసారని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చెబుతోంది. అయితే, ఇందులో లే ఆఫ్ తీసుకున్న 10 మిలియన్ల మంది గురించి ప్రస్తావించలేదు. నిజానికి ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని ‘యూఎస్ టుడే’ పేర్కొంది. గతవారం 6.6 లక్షల మంది భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు యూఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ గురువారం తెలిపింది. మున్ముందు మరిన్ని రంగాలకు కోతలు విస్తరిస్తాయని కెరీర్స్ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్ సీనియర్ ఎకనమిస్ట్ డేనియల్ జావో తెలిపారు.



Updated Date - 2020-04-05T02:22:54+05:30 IST