సింగపూర్‌లో ఏడుగురు భారతీయులకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-06T07:23:52+05:30 IST

సింగపూర్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటివరకు సింగపూర్ వ్యాప్తంగా 1,309 మందికి కరోనా సోకింది. శనివారం 75, ఆదివారం 120 కేసులు

సింగపూర్‌లో ఏడుగురు భారతీయులకు కరోనా పాజిటివ్

సింగపూర్: సింగపూర్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటివరకు సింగపూర్ వ్యాప్తంగా 1,309 మందికి కరోనా సోకింది. శనివారం 75, ఆదివారం 120 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నమోదైన కేసులలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా బారిన పడిన భారతీయుల వయసు 18 నుంచి 52 ఏళ్ల వరకు ఉన్నట్టు ప్రకటించారు. వీరందరూ వర్క్‌ పాసెస్‌ మీద సింగపూర్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో చాలా వరకు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే సోకిన్టటు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 23 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, దీంతో ఇప్పటివరకు మొత్తంగా 320 మంది పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 569 మంది ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు, 25 మంది మాత్రం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు అమెరికా, యూకే నుంచి వచ్చిన వారికే 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలనే ఆదేశాలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరికొన్ని దేశాలు చేరాయి. ఫ్రాన్స్, ఇండియా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ప్రతిఒక్కరు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2020-04-06T07:23:52+05:30 IST