స్మశానాల్లో బట్టలు దొంగిలించి.. మార్కెట్లో అమ్మేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-10T23:01:21+05:30 IST

స్మశానాలలోని మృతదేహాలపై ఉండే బట్టలను దొంగిలించి వాటిని మార్కెట్లో అమ్మేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.

స్మశానాల్లో బట్టలు దొంగిలించి.. మార్కెట్లో అమ్మేస్తున్నారు!

స్మశానాలలోని మృతదేహాలపై ఉండే బట్టలను దొంగిలించి వాటిని మార్కెట్లో అమ్మేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు ఈ ముఠాకు చెందిన ఏడుగురు సభ్యులను ఆదివారం అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని భగపత్‌ జిల్లాకు చెందిన వస్త్ర వ్యాపారి పవన్‌ జైన్‌, అతడి అనుచరులు దాదాపు 10 సంవత్సరాలుగా స్మశానాల్లో పాతిపెట్టిన శవాలపై ఉండే దుస్తులను దొంగిలిస్తున్నారు.


ఆ దుస్తులను శుభ్రం చేసి, వాటికి పలు కంపెనీల స్టిక్కర్లు అతికించి దేశంలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. స్మశానాల్లోని దుస్తులు దొంగిలించే తన అనుచరులు ఒక్కొక్కరికీ పవన్ జైన్ రోజుకు 300 రూపాయలు ఇచ్చేవాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్‌ జైన్‌‌తోపాటు అతడి అనుచరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 520 బెడ్‌ షీట్లు, 127 కుర్తాలు, 140 చొక్కాలు, 34 దోతీలు, 112 ట్రేడ్‌ మార్క్‌ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2021-05-10T23:01:21+05:30 IST