బేగంపేట నైట్‌షెల్టర్‌లో ఏడుగురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-05-07T06:28:16+05:30 IST

కరోనా విస్తరిస్తుండడంతో నైట్‌ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న వారి విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

బేగంపేట నైట్‌షెల్టర్‌లో ఏడుగురికి పాజిటివ్‌

ప్రకృతి చికిత్సాలయానికి తరలింపు 

అందరికీ టీకాలు

బేగంపేట, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా విస్తరిస్తుండడంతో నైట్‌ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న వారి విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బేగంపేట నైట్‌ షెల్టర్‌లో సుమారు 40 మంది ఉన్నారు. ఆమన్‌ వేదిక ఎన్జీఓ సంస్థ ఈ షెల్టర్‌ నడుపుతోంది. మూడురోజుల క్రితం ఇందులో ఉన్న పలువురు అనారోగ్యం బారిన పడ్డారు. డీపీవో నీరజాదేవి అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ఏడుగురికి పాజిటివ్‌రావడంతో వారిని అమీర్‌పేట ప్రకృతి చికిత్సాలయంలోని ఐసొలేషన్‌కు తరలించారు. నైట్‌ షెల్టర్‌లో ఉన్న వారందరికీ జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల అనుమతితో పాటిగడ్డ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వ్యాక్సిన్‌ వేయించారు. నైట్‌షెల్టర్‌ను శానిటైజ్‌ చేసి అందరికీ మాస్కులు, శానిటైజర్లను డీసీ ముకుందరెడ్డి, డీపీవో నీరజాదేవి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నైట్‌ షెల్టర్‌లో ఉన్న వారికి ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకు ముందు బస్తీ దవాఖానాలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో యూసీడీ(సీవో) అశోక్‌, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T06:28:16+05:30 IST