ఎగుమతుల్లో 7.5 శాతం వృద్ధి

ABN , First Publish Date - 2021-01-16T07:04:15+05:30 IST

భారత్‌ నుంచి ఎగుమతులు డిసెంబరు నెలలో 7.56 శాతం పెరిగి 2,715 కోట్ల డాలర్లకు (రూ.2.04 కోట్లు) చేరాయి. ఇదే సమయంలో వాణిజ్య లోటు కూడా 1,544 కోట్ల డాలర్లకు పెరిగింది

ఎగుమతుల్లో 7.5 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులు డిసెంబరు నెలలో 7.56 శాతం పెరిగి 2,715 కోట్ల డాలర్లకు (రూ.2.04 కోట్లు) చేరాయి. ఇదే సమయంలో వాణిజ్య లోటు కూడా 1,544 కోట్ల డాలర్లకు  పెరిగింది. బంగారం దిగుమతులు భారీగా 81.82 శాతం పెరగడంతో డిసెంబరు నెల దిగుమతులు 4,259 కోట్ల డాలర్లకు (రూ.3.19 కోట్లు) చేరాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో ఎగుమతుల రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. పెట్రోలియం ఉత్పత్తులు 35.35 శాతం తగ్గగా రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతులు 15.05 శాతం దిగజారాయి. ఎలక్ర్టానిక్‌ ఎగుమతులు 16.51 శాతం, రసాయనాలు 10.79 శాతం పెరిగాయి. 

Updated Date - 2021-01-16T07:04:15+05:30 IST