69ఏళ్ల వృద్ధురాలిని విమానం ఎక్కకుండా అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ఒకే ఒక్క కారణంతో వెనక్కి పంపించేశారు!

ABN , First Publish Date - 2022-05-21T21:10:29+05:30 IST

ఆమెకు 69ఏళ్లు. అమెరికాలో ఉంటున్న మనవడు, మనవరాలితో గడపాలని ఎళ్లుగా ఎదురు చూస్తోంది. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రయాణానికి ఆమె సిద్ధం అయింది. ఎం

69ఏళ్ల వృద్ధురాలిని విమానం ఎక్కకుండా అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ఒకే ఒక్క కారణంతో వెనక్కి పంపించేశారు!

ఎన్నారై డెస్క్: ఆమెకు 69ఏళ్లు. అమెరికాలో ఉంటున్న మనవడు, మనవరాలితో గడపాలని ఎళ్లుగా ఎదురు చూస్తోంది. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రయాణానికి ఆమె సిద్ధం అయింది. ఎంతో ఆశగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. విమానాశ్రయంలో ఆమెకు చుక్కెదురైంది. ఒకే ఒక్క కారణంతో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమె వెనక్కి పంపించారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


బెంగళూరుకు చెందిన 69ఏళ్ల శైలజ అనే మహిళ బీటీఎం లేఔట్‌లో నివసిస్తున్నారు. ఆమె పిల్లలు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్యానికి వెళ్లాలని, మనవడు, మనవరాలితో సరదాగా గడపాలని ఆమె గత నాలుగేళ్లుగా ఎదురుస్తున్నారు. తాజాగా శైలజ కూతురు ఇండియాకు వచ్చారు. ఇక్కడ కొన్ని రోజులు గడిపిన అనంతరం తన తల్లిని అమెరికా తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే శైలజ‌ను తీసుకుని తీసుకుని ఆమె  బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. 



ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు శైలజకు ఆమె కూతురు షాకిచ్చారు. ఏళ్లపాటు నిరుపయోగంగా ఉన్న కారణంగా శైలజ పాస్‌పోర్ట్ చిరిగిపోయిందని.. ఆ డ్యామేజీ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ తల్లీకుతురు కంగుతిన్నారు. అయితే ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆమె ప్రయాణానికి అధికారులు అనుమతించకపోవడంతో.. వారిద్దరూ వెనుతిరిగారు. ఈ సందర్భంగా శైలజ కూతురు మాట్లాడుతూ.. తమ అమెరికా ప్రయాణాన్ని ఈ నెల 27కు రీషెడ్యూల్ చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తన తల్లి కొత్తపాస్‌ పోర్టు కోసం అప్లై చేసినట్టు వెల్లడించారు.  


Updated Date - 2022-05-21T21:10:29+05:30 IST