అర్బన్‌ జిల్లాలో 67 కేసులు

ABN , First Publish Date - 2020-08-11T11:02:13+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సోమవారం 67 కరోనా కేసులు నమోద య్యాయి. శని, ఆదివారాల్లో పరీక్షలు నిర్వహించగా బాధితుల్లో దీర్ఘకాలిక

అర్బన్‌ జిల్లాలో 67 కేసులు

హన్మకొండ అర్బన్‌,  ఆగస్టు 10:  వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సోమవారం 67 కరోనా కేసులు నమోద య్యాయి. శని, ఆదివారాల్లో పరీక్షలు నిర్వహించగా బాధితుల్లో దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారిని, ప్రాథమిక స్థాయిదాటిన వారిని ఎంజీఎం కొవిడ్‌ వార్డులో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉన్నవారు 17 రోజుల పాటు గృహనిర్భంధాన్ని పాటించాలని సూచించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ హోంక్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్యపరిస్థితిని  పర్యవేక్షించి తగిన మందులను అందిస్తున్నామని వారు తెలిపారు. 

Updated Date - 2020-08-11T11:02:13+05:30 IST