మహారాష్ట్రలో ఇవాళ 6వేలకు పైగా కరోనా కేసులు..కానీ గుడ్‌న్యూస్ ఏంటంటే..

ABN , First Publish Date - 2020-07-03T03:40:50+05:30 IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఇవాళ తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో ఇవాళ 6వేలకు పైగా కరోనా కేసులు..కానీ గుడ్‌న్యూస్ ఏంటంటే..

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఇవాళ తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. తొలిసారిగా.. ఒక్కసారిగా 6వేలకు పైగా కరోనా కేసులు నేడు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 6,330 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.


అయితే.. కొంత ఊరట కలిగించే విషయం ఏంటంటే.. కరోనా కేసులు పెరిగినప్పటికీ ఇవాళ కరోనా మరణాలు తగ్గి.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పెరిగింది. ఇవాళ మహారాష్ట్రలో 8,018 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.


బుధవారం మహారాష్ట్రలో కరోనా సోకిన వారిలో ఇవాళ 198 మంది మరణించగా.. గురువారం ఈ సంఖ్య తగ్గింది. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో గురువారం 125 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,626 చేరింది. ఇందులో 1,01,172 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మరణాల సంఖ్య 8,178కి చేరింది.



Updated Date - 2020-07-03T03:40:50+05:30 IST