తెరపైకి 63ఏళ్లు!

ABN , First Publish Date - 2020-06-06T09:50:45+05:30 IST

ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఎంబీబీఎస్‌ వైద్యుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 63 ఏళ్లు చేసే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిల్లోని వైద్యులకు రెండు రకాలుగా పదవీ విరమణ వయస్సు

తెరపైకి 63ఏళ్లు!

  • ఎంబీబీఎస్‌ వైద్యులకూ అమలు చేయాలి
  • సీఎంవోకు ప్రభుత్వ వైద్యుల సంఘం విన్నపం


అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఎంబీబీఎస్‌ వైద్యుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 63 ఏళ్లు చేసే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిల్లోని వైద్యులకు రెండు రకాలుగా పదవీ విరమణ వయస్సు అమలవుతోంది. వైద్య విద్యలో పీజీ పూర్తిచేసినవారి పదవీ విరమణ వయస్సు 63 ఏళ్లు, ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉనవారికి 60గా ఉంది. 2017 అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్యుల కొరతను దృష్టిలో పెట్టుకుని వారికి మరో మూడేళ్లు సర్వీస్‌ పొడిగించింది. అప్పటి నుంచి ఎంబీబీఎస్‌ వైద్యులు దీనిపై పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు కూడా 63 ఏళ్ల నిబంధన వర్తింపజేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు మార్చిలో సీఎంవోకు లేఖ రాశారు. స్పందించిన సీఎంవో అధికారులు వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆరోగ్యశాఖను కోరారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అధికారులు శుక్రవారం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వివరాలు అందజేశారు. ఎంబీబీఎస్‌ వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. 63ఏళ్లు అమలు చేస్తే 944 మందికి వైద్యులకు లాభం చేకూరనుంది.

Updated Date - 2020-06-06T09:50:45+05:30 IST