గుజరాత్‌: పతంగుల వల్ల 63 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-15T00:42:44+05:30 IST

గుజరాత్‌లో ఘనంగా ప్రారంభమైన ఉత్తరాయన్ పండగ ప్రారంభం రోజే పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ పండగవేళ రాష్ట్రవ్యాప్తంగా పతంగుల హడావుడి ఉంటుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పతంగుల ఎగురవేత పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అయితే పతంగులు, వాటి దారాల కారణంగా..

గుజరాత్‌: పతంగుల వల్ల 63 మందికి గాయాలు

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘనంగా ప్రారంభమైన ఉత్తరాయన్ పండగ ప్రారంభం రోజే పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ పండగవేళ రాష్ట్రవ్యాప్తంగా పతంగుల హడావుడి ఉంటుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పతంగుల ఎగురవేత పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అయితే పతంగులు, వాటి దారాల కారణంగా రాష్ట్రంలో సుమారు 63 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో ఎక్కువ మంది రోడ్డుపై వెళ్తున్న వారే కావడం గమనార్హం. ఎక్కువ మందికి గొంతు దగ్గర, ముఖంపై పతంగుల దారాలు తెగాయి. పతంగుల క్షతగాత్రుల నుంచి శుక్రవారం ఒక్కరోజే 108 సర్వీస్ కేంద్రానికి 1,203 ఫోన్ కాల్స్ వచ్చాయాట. అయితే గతేడాది ఇదే రోజున 1,043 కాల్స్ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పతంగులు ఎగురవేసే 69 మంది టెర్రస్ మీద నుంచి కింద పడ్డారు. ఇందులో కొంత మంది తెగిన పతంగిని పట్టుకునే క్రమంలో మరికొందరు ఎగురవేసే క్రమంలో కింద పడ్డట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఇక మొత్తంగా గాయపడ్డ వారిలో 21 మంది రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అహ్మదాబాద్‌కు చెందినవారేనట. ఆ తర్వాత వడోదర, రాజ్‌కోట్‌లు ఉన్నాయి.

Updated Date - 2022-01-15T00:42:44+05:30 IST