620 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-05-08T05:27:17+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. రోజూ వెయ్యి వరకు కేసులు నమోదవుతుండగా ఆ సంఖ్య శుక్రవారం తగ్గింది.

620 పాజిటివ్‌ కేసులు నమోదు

కడ ప, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. రోజూ వెయ్యి వరకు కేసులు నమోదవుతుండగా ఆ సంఖ్య శుక్రవారం తగ్గింది. 24గంటల వ్యవధిలో 620 మందిలో పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటినలో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,644కు చేరింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 755 మందిని డిశ్చార్జి చేయగా రికవరీ కేసుల సంఖ్య 62,819కు చేరింది. ఆసుపత్రుల్లో 1,894 మంది, హోం ఐసోలేషనలో 4,368 మంది చికిత్స పొందుతున్నారు.


పాజిటివ్‌ కేసులు మండలాల వారీగా..

కడపలో 127, రైల్వేకోడూరు 76,  రాజంపేట 37,  ప్రొద్దుటూరు 36, కాశినాయన 31, నందలూరు 26, బద్వేలు 23, పులివెందుల, ఓబులవారిపల్లె, సీకేదిన్నె మండలాల్లో 22 చొప్పున, రాజుపాలెం 15, ఎల్‌ఆర్‌పల్లె 13, రామాపురం 12, పోరుమామిళ్ల, పుల్లంపేట మండలాల్లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే బికోడూరు మండలంలో 10, సిద్దవటం, పెనగలూరు 8, ఖాజీపేట 7, చాపాడు, చెన్నూరు, వీరబల్లె 6, రాయచోటి, వేంపల్లె 5,  కొండాపురం,  చిట్వేలి, తొండూరు మండలాల్లో 4 చొప్పున, చక్రాయపేట, ముద్దనూరు, సంబేపల్లె, సింహాద్రిపురం, వల్లూరు, వీఎనపల్లె మండలాల్లో 3 చొప్పున, అట్లూరు, చిన్నమండెం, జమ్మలమడుగు, మైదుకూరు, పెద్దముడియం, పెండ్లిమర్రి మండలాల్లో 2 చొప్పున, గోపవరం, కలసపాడు, కమలాపురం, మైలవరం మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా వేరే జిల్లా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


కరోనాతో పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకుడు మృతి

ప్రొద్దుటూరు టౌన, మే 7: స్థానిక కొర్రపాడు రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకుడిగా విఽధులు నిర్వహిస్తున్న సురేష్‌ (59) కరోనాతో మృతి చెందాడని కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస ప్రసాద్‌ తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన ఆయన ఇక్కడి కళాశాలలో కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, మెకానికల్‌ విభాగం హెచవోడీగా పనిచేసేవారని తెలిపారు. అతను పట్టణంలో ఓ ఇంట్లో ఒక్కరే నివాసం ఉంటున్నారని కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటూ గురువారం సాయంత్రం మృతి చెందారన్నారు. అధ్యాపకుని మృతిపట్ల సంతాపం తెలుపుతూ శుక్రవారం కళాశాలకు సెలవు ప్రకటించారు.


ఆర్టీపీపీలో భయం... భయం

కరోనాతో ఒకే రోజు ముగ్గురు ఉద్యోగులు మృతి

ఎర్రగుంట్ల, మే 7: ఆర్టీపీపీలో కరోనా విళయతాండవం చేస్తోంది. గురువారం ఒకే రోజు ముగ్గురు ఉద్యోగులు మరణించారు. లోకో ఆపరేటర్‌ మణిపాల్‌, పీఏ వెంకటస్వామిరెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్టీపీపీ కాలనీలో మరో 200మంది కరోనా బారినపడ్డారని అనధికారిక సమాచారం. వీరంతా ఏపీ, తెలంగాణాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ బిక్కుబిక్కుమంటున్నారని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు కాలనీలో 14మంది మృతి చెందారు. ఆర్టీపీపీ కాలనీలో వెంటనే కరోనా వ్యాక్సినేషన సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టు హాస్టల్‌లో ఆక్సిజన సౌకర్యం కల్పించాలని, 20పడకల కొవిడ్‌ ఆసుపత్రిని అనుభజ్ఞులైన వైద్యులతో ఏర్పాటు చేయాలని సీఈని, యాజమాన్యాన్ని పవర్‌ జేఏసీ కోరింది.


కలెక్టర్‌కు లేఖ... 

ఆలస్యంగా మేల్కొన్న ఏపీ జెనకో ఎండీ బి.శ్రీధర్‌ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆర్టీపీపీలో  సుమారు 3300 మంది ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని వీరందరికి ప్రఽథమ ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన చేయించాలని లేఖలో కోరారు. అయితే ఇప్పటి వరకు కేవలం 966మందికి మాత్రమే మొదటి డోస్‌, 80మందికి రెండవ డోస్‌ వ్యాక్సినేషన చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.


నేటి నుంచి అందుబాటులో రెండో డోస్‌ కోవాగ్జిన 

కడప, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో డోస్‌ కోవాగ్జిన తీసుకోవాల్సిన వారి కోసం శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 21 పీహెచసీ, సీహెచసీలకు వెళ్లి కోవాగ్జిన రెండో డోసు వేయించుకోవాలని సూచించారు. జిల్లాకు 5వేల డోసుల కోవాగ్జిన వచ్చిందని, మొదటి డోసు తీసుకుని 4 వారాలు పూర్తి చేసుకుని ఆరువారాల్లోపు ఉన్నవారందరూ తప్పనిసరిగా రెండో డోస్‌ వేయించుకోవాలని కోరారు.


కోవాగ్జిన రెండో డోసు వేసేది ఇక్కడే..

జిల్లా వ్యాప్తంగా కోవాగ్జిన రెండో డోసును 21 కేంద్రాల్లో వేయనున్నారు. సీకేదిన్నె, రామాపురం, సంబేపల్లె, పుల్లంపేట, రైల్వేకోడూరు, నందలూరు, ఒంటిమిట్ట, వేముల, వేంపల్లె, లింగాల, చిలమకూరు, ఎర్రగుంట్ల, వల్లూరు, ఖాజీపేట మండలంలోని మిడ్తూరు పీహెచసీలలో రెండో డోసు టీకా వేయనున్నారు. అలాగే రాజంపేట, రాయచోటి పీపీ యూనిట్‌లలో, ఏకే రోడ్డు1, ఏకే రోడ్డు 2, ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌కాలనీ, కోటా స్ర్టీట్‌, కడపలోని నకాష్‌ అర్బన హెల్త్‌ సెంటర్లలో రెండో డోసు టీకా వేయనున్నారు.

Updated Date - 2021-05-08T05:27:17+05:30 IST