60 స్మార్ట్ ఫోన్లు చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-11T14:49:25+05:30 IST

సెల్‌ఫోన్‌ షాపునకు కన్నం వేసిన ఇద్దరు నిందితులను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 14 లక్షల విలువ చేసే 57 బ్రాండెడ్‌ కొత్త ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో ఎన్నో కేసులున్నాయి.

60 స్మార్ట్ ఫోన్లు చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్

షాపునకు కన్నం వేసిన నిందితులు..


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌ షాపునకు కన్నం వేసిన ఇద్దరు నిందితులను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 14 లక్షల విలువ చేసే 57 బ్రాండెడ్‌ కొత్త ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో ఎన్నో కేసులున్నాయి. నిందితుల్లో ఒకరిపై పీడీ యాక్ట్‌ నమోదవడంతో జైలు శిక్ష అనుభవించాడు. సోమవారం విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. బహదూర్‌పురా, కిషన్‌బాగ్‌ నివాసి ఫయాజుల్లా ఖాన్‌ అలియాస్‌ కండా ఫయాజ్‌(38) స్థానికంగా చిరు వ్యాపారం చేస్తుంటాడు. అతడి అనుచరుడు ఈదీబజార్‌ నివాసి సయ్యద్‌ మహబూబ్‌ అలీ అలియాస్‌ ఖుస్రూ(42) వంటవాడిగా పని చేస్తున్నాడు.


పాత నేరస్థులైన వీరిద్దరూ ముఠాగా ఏర్పడ్డారు. మూడు కమిషనరేట్ల పరిధుల్లో పలు చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలో ఓ సెల్‌ఫోన్‌ షాపులో 57 స్మార్ట్‌ ఫోన్లు చోరీ చేశారు. దృష్టి మరల్చి మరో మూడు సెల్‌ఫోన్లు తస్కరించారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను సోమవారం పట్టుకున్నారు. వారినుంచి మొత్తం 60 సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఫయాజుల్లా ఖాన్‌ 2014 నుంచి చోరీల బాట పట్టాడు. ఇప్పటి వరకు మూడు కమిషనరేట్ల పరిధులతోపాటు నల్లగొండ వన్‌టౌన్‌ పీఎస్‌ పరిధిలో 10 ఇళ్లలో చోరీ కేసుల్లో నిందితుడు. ఫయాజ్‌పై చాదర్‌ఘాట్‌ పీఎ్‌సలో పీడీ యాక్ట్‌ నమోదైంది. అతడి అనుచరుడు మహబూబ్‌ అలీ 2000 నుంచి చోరీలు చేస్తున్నాడు. 14 నేరాల్లో నిందితుడు. ఇతడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని సీపీ తెలిపారు.

Updated Date - 2020-08-11T14:49:25+05:30 IST