60 ఏళ్లు దాటిన ప్రవాసులకు ఇన్సూరెన్స్ ఫీజు ఫిక్స్.. రెసిడెన్సీ రెన్యువ్‌కు ఇది తప్పనిసరి!

ABN , First Publish Date - 2022-02-02T13:47:11+05:30 IST

60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఇటీవలే రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(రూ.61వేలు) నిర్ణయించిన విషయం తెలిసిందే.

60 ఏళ్లు దాటిన ప్రవాసులకు ఇన్సూరెన్స్ ఫీజు ఫిక్స్.. రెసిడెన్సీ రెన్యువ్‌కు ఇది తప్పనిసరి!

కువైత్ సిటీ: 60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఇటీవలే రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(రూ.61వేలు) నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, రెసిడెన్సీ రెన్యువల్‌కు ఇన్సూరెన్స్ పాలసీ(ఆరోగ్య బీమా) తప్పనిసరి. తాజాగా ఈ కేటగిరీ ప్రవాసుల బీమా రుసుమును ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ 500 కువైటీ దినార్లుగా(రూ.1.23లక్షలు) నిర్ణయించింది. అలాగే ఇతర చార్జీల రూపంలో మరో 3.5 కేడీలు(రూ.864) చెల్లించాలి. ఇలా ఆరోగ్య బీమా కోసం ప్రవాసులు మొత్తం 503.5 కేడీలు(రూ.1.24లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.


కాగా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ ఆమోదం పొందిన కంపెనీలకు మాత్రమే ప్రవాసులకు బీమా అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ నివేదికల ప్రకారం దేశంలో దాదాపు 20 కంపెనీలు ఈ బీమాను అందించగలవని సమాచారం. ఇక పీఏఎం అధికారిక వెబ్‌సైట్ www.manpower.gov.kw ద్వారా ఆన్‌లైన్‌లో ప్రవాసులకు వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసే వీలు ఉంది. కంపెనీలు అన్ని సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా వర్క్ పర్మిట్‌లను పునరుద్ధరించవచ్చు. 


ఇదిలాఉంటే.. యూనివర్సిటీ డిగ్రీలేని 60 ఏళ్లు పైబడిన ప్రవాసులు వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా జనవరి 30న(ఆదివారం) గెజిట్ విడుదల చేసింది. దీంతో వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. ప్రవాసులు వార్షిక రుసుముగా 250 కువైటీ దినార్లు(సుమారు రూ.61వేలు) చెల్లించి, సమగ్ర ఆరోగ్య బీమాను పొందడం ద్వారా పర్మిట్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - 2022-02-02T13:47:11+05:30 IST