జిల్లాకు 60 వేరుశనగ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు

ABN , First Publish Date - 2021-06-12T06:25:36+05:30 IST

జిల్లాకు 60 వేరుశనగ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఉద్యాన శాఖ ఇన్‌చార్జి డీడీ సతీష్‌ శుక్రవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాకు 60 వేరుశనగ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు


ఉద్యాన శాఖ ఇన్‌చార్జి డీడీ సతీష్‌


అనంతపురం వ్యవసాయం, జూన్‌ 11:  జిల్లాకు 60 వేరుశనగ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఉద్యాన శాఖ ఇన్‌చార్జి డీడీ సతీష్‌ శుక్రవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం కింద గరిష్టంగా రూ.10 లక్షలదాకా సబ్సిడీ పొందవచ్చునన్నారు. చిన్నతరహా ఆహార యూనిట్లు (వేరుశనగ నూనె, వేరుశనగ చిక్కి, మసాలా పీనట్స్‌, పీనట్స్‌ బటర్‌, పీనట్స్‌ కుకీస్‌) స్థాపించుకునేందుకు యువతీయువకులు, డ్వాక్రా మహిళలు, రైతు ఉత్పత్తి, సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఔత్సాహికులు ఆధార్‌, పాన్‌ కార్డుతోపాటు బ్యాంకు అకౌంట్‌ తదితర వివరాలతో జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌ సమీపంలోని ఉద్యానశాఖ డీడీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Updated Date - 2021-06-12T06:25:36+05:30 IST