60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-07-25T05:36:48+05:30 IST

మార్కాపురం అడ్డరోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మినీ లారీతో సహా శనివారం పొదిలిలో ఎస్‌ఐ వై.శ్రీహరి తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. స్పెషల్‌ బ్రాంచి ఏఎ్‌సఐ ఎండీకే షరీఫ్‌ అందించిన సమాచారం మేరకు పోలీసులు బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం కనిగిరి నుంచి అద్దంకికి వెళ్తున్నట్లు తెలిసింది. డ్రైవర్‌ మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
పట్టుబడిన రేషన్‌బియ్యం మినీ లారీ

పొదిలి, జూలై 24 : మార్కాపురం అడ్డరోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మినీ లారీతో సహా శనివారం పొదిలిలో ఎస్‌ఐ వై.శ్రీహరి తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. స్పెషల్‌ బ్రాంచి ఏఎ్‌సఐ ఎండీకే షరీఫ్‌ అందించిన సమాచారం మేరకు పోలీసులు బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం కనిగిరి  నుంచి అద్దంకికి వెళ్తున్నట్లు తెలిసింది. డ్రైవర్‌ మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తదుపరి చర్యలు నిమిత్తం బియ్యంను సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.

 మార్కాపురంలో 40 బస్తాలు స్వాధీనం

మార్కాపురం, జూలై 24 : మార్కాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సత్యసాయి దేవస్థానం సమీపంలో ఒక ఇంట్లో రేషన్‌ బియ్యాన్ని నిల్వ  ఉంచారు. 40 బస్తాలను వాహనంలో లోడ్‌ చేసి తరలించేందుకు సిద్ధం చేశారు. వీఆర్వో కోటయ్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   



Updated Date - 2021-07-25T05:36:48+05:30 IST