తల్లి ఇచ్చిన Chocolate ను తిని పడిపోయిన ఆరేళ్ల పాప.. ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం.. డాక్టర్లు ఏం తేల్చారంటే..

ABN , First Publish Date - 2022-07-22T14:42:26+05:30 IST

స్కూల్‌కు వెళ్లనంటూ చిన్న పిల్లలు మారాం చేస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రలు వారిని బుజ్జగించి.. ఏదో ఒక తిను బండారం కొనిచ్చి పిల్లలను స్కూల్‌కు పంపుతారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. తల్లి ఇచ్చిన చాక్లెట్ (Cho

తల్లి ఇచ్చిన Chocolate ను తిని పడిపోయిన ఆరేళ్ల పాప.. ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం.. డాక్టర్లు ఏం తేల్చారంటే..

ఇంటర్నెట్ డెస్క్: స్కూల్‌కు వెళ్లనంటూ చిన్న పిల్లలు మారాం చేస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రలు వారిని బుజ్జగించి.. ఏదో ఒక తిను బండారం కొనిచ్చి పిల్లలను స్కూల్‌కు పంపుతారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. తల్లి ఇచ్చిన చాక్లెట్ (Chocolate) తిని ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. దీంతో ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె.. కూతురుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పాప వయసు 6ఏళ్లు. దీంతో ఆ మహిళ తన కూతురుని స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూల్‌లో చేర్పించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ చిన్నారి స్కూల్‌కు వెళ్లనని మారాం చేసింది. స్కూల్ బస్సు వచ్చే సమయానికి బడికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఆ మహిళ.. తన కూతురుని బుజ్జగించింది. చాక్లెట్ ఇచ్చి బస్సెక్కించింది. 



తల్లి ఇచ్చిన చాక్లెట్‌ను ఎంతో ఇష్టంగా తిన్న ఆ చిన్నారి.. బస్సులో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆ ఆరేళ్లపాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసి చిన్నారి మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. కవర్‌తో సహా చిన్నారి చాక్లెట్ తినిందని.. అది గొంతులో అడ్డుపడటం వల్ల మరణించిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


Updated Date - 2022-07-22T14:42:26+05:30 IST