అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2020-07-12T08:01:24+05:30 IST

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తిరాప్‌ జిల్లా ఖోన్సాలో అస్సామ్‌ రైఫిల్స్‌, తిరుగుబాటుదారుల మధ్య శనివారం ఉదయం 4.30 గంటలకు ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిమ్‌ ఇసాక్‌-మువా...

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌

  • ఆరుగురు తిరుగుబాటుదారుల హతం, జవాన్‌కు గాయం
  • కశ్మీర్‌లోనూ ఇద్దరు ఉగ్రవాదులు ఖతం

న్యూఢిల్లీ, జూలై 11: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తిరాప్‌ జిల్లా ఖోన్సాలో అస్సామ్‌ రైఫిల్స్‌, తిరుగుబాటుదారుల మధ్య శనివారం ఉదయం 4.30 గంటలకు ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిమ్‌ ఇసాక్‌-మువా (ఎన్‌ఎ్‌ససీఎన్‌, ఐఎం) కు చెందిన ఆరుగురు తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఓ జవాన్‌ గాయపడ్డారు. ఖోన్సాలో ఎన్‌ఎ్‌ససీఎన్‌ తిరుగుబాటుదారులు సంచరిస్తున్నట్లు నిఘా విభాగం నుంచి సమాచారం అందడంతో అస్సాం రైఫిల్స్‌ గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నాగామ్‌ సెక్టార్‌ వద్ద ఉగ్రవాదుల కదలికలను బలగాలు పసిగట్టి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.


Updated Date - 2020-07-12T08:01:24+05:30 IST