Abn logo
Sep 21 2021 @ 01:17AM

రష్యా వర్సిటీలో కాల్పులు.. 6 మంది మృతి

మాస్కో, సెప్టెంబరు 20: రష్యాలోని పెర్మ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 6 మంది ప్రాణాలు కోల్పోయా రు. ప్రాణభయంతో వర్సిటీ భవనాల నుంచి దూకి 28 మందికిపైగా గాయాలపాలయ్యారు. నిందితుడిని అరెస్టు చేశామని ప్రభుత్వం ప్రకటించింది.  నిందితుడు ఉపయోగించిన తుపాకీ.. రబ్బరు తూటాలు ప్రయోగించడానికి వాడతారని యూనివర్సిటీ ప్రెస్‌ తెలిపింది. అయితే.. దాన్ని మందుగుండు పేల్చే విధంగా కూడా మార్పు చేసుకోవచ్చని పేర్కొంది.