రాత్రి భోజనం చేశాక నిద్రపోయేందుకు సిద్ధమైన కుటుంబ సభ్యులు.. సడన్‌గా ఇంట్లోంచి శబ్దం.. అనుమానంతో లైట్ వేసి చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2022-06-18T20:31:36+05:30 IST

ఆ కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేసి నిద్రపోయేందుకు సిద్ధమవుతున్నారు..

రాత్రి భోజనం చేశాక నిద్రపోయేందుకు సిద్ధమైన కుటుంబ సభ్యులు.. సడన్‌గా ఇంట్లోంచి శబ్దం.. అనుమానంతో లైట్ వేసి చెక్ చేస్తే..

ఆ కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేసి నిద్రపోయేందుకు సిద్ధమవుతున్నారు.. హఠాత్తుగా మంచం కింద నుంచి ఏదో శబ్దం వచ్చింది.. ఆ శబ్దం ఏంటా అని లైట్ వేసి మంచం కింద చూశారు.. అక్కడ ఆరు అడుగుల బ్లాక్ కోబ్రా ఉంది.. షాకైన కుటుంబ సభ్యులు వెంటనే ఇంటి నుంచి బయటకు పారిపోయారు.. పర్యావరణ ప్రేమికుడు గోవింద్ శర్మ ఆ పామును పట్టి తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. రాజస్థాన్‌లోని కోటకు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

ఆ ఊరందరిదీ అదే పని.. ఇంట్లోనే కూర్చుని ల్యాప్‌టాప్ ముందేసుకుని ఫోన్‌కాల్స్.. క్షణాల్లో ఖాతాల్లోకి లక్షల్లో డబ్బు..!



కోటకు సమీపంలోని జాగ్‌పురా ప్రాంతంలోని అమర్ లాల్ ఇంట్లోకి శుక్రవారం రాత్రి ఓ బ్లాక్ కోబ్రా ప్రవేశించింది. 6 అడుగుల పొడవున్న ఆ పాము మంచం కింద ఉండిపోయింది. పాము చేసిన చప్పుడు విని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటి నుంచి బయటకు పారపోయారు. దాదాపు రెండు గంటల పాటు ఇంటి బయటే ఉండిపోయారు. పర్యావరణ ప్రేమికుడు గోవింద్ శర్మను సంఘటనా స్థలానికి పిలిపించారు. గోవింద్ సంఘటనా స్థలానికి వెళ్లి పామును రక్షించి తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.


వర్షాకాలంలో పాములు తరచుగా వాటి బొరియల్లోంచి బయటకు వస్తాయని, వాటికి ఇష్టమైన ఆహారమైన ఎలుకల కోసం జనావాస ప్రాంతాలకు వస్తుంటాయని గోవింద్ చెప్పారు. అలాగే, బ్లాక్ కోబ్రా శబ్దం చేయడం ద్వారా తన ఉనికిని చెబుతుందని అన్నారు. 

Updated Date - 2022-06-18T20:31:36+05:30 IST