6 రోజులు.. కేసులు మూడు రెట్లు

ABN , First Publish Date - 2022-01-01T06:48:32+05:30 IST

రాష్ట్రంలో వరుసగా ఆరో రోజూ కరోనా కేసులు పెరిగాయి. గత నెల

6 రోజులు.. కేసులు మూడు రెట్లు

రాష్ట్రంలో వందనుంచి మూడువందలకు

కొత్తగా 311 మందికి వైరస్‌ నిర్ధారణ

హైదరాబాద్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరుసగా ఆరో రోజూ కరోనా కేసులు పెరిగాయి. గత నెల 26న నమోదైనవాటితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. శుక్రవారం 36,759 మందికి పరీక్షలు చేయగా 311 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. సెప్టెంబరు 15న రాష్ట్రంలో 324 కొవిడ్‌ కేసులు వచ్చాయి. మూడున్నర నెలల తర్వాత తాజాగా 300 దాటాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.


 శుక్రవారం నమోదైనవాటిలో 198 జీహెచ్‌ఎంసీవే ఉన్నాయి. మేడ్చల్‌లో 32, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వచ్చాయి. కాగా, రాష్ట్రంలో కొవిడ్‌తో మరో ఇద్దరు మృతిచెందారు. ప్రస్తుతం 3650 యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు విదేశాల నుంచి 159 మంది రాగా.. వీరిలో ఏడుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ తేలింది. నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. కొత్తగా ఒమైక్రాన్‌ కేసు నమోదు కాలేదని వైద్యశాఖ ప్రకటించింది. శుక్రవారం 2.84 లక్షల మందికి టీకాలిచ్చారు. 



6 రోజులుగా ఇలా..

తేదీ కేసులు

26.12.21 109

27.12.21 182

28.12.21 228

29.12.21 235

30.12.21 280

31.12.21 311

Updated Date - 2022-01-01T06:48:32+05:30 IST