బాలికకు లైంగిక వేధింపులు.. వృద్ధుడితో సహా ఆరుగురి అరెస్టు

ABN , First Publish Date - 2020-06-07T15:50:06+05:30 IST

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 75 ఏళ్ల వృద్ధుడు సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

బాలికకు లైంగిక వేధింపులు.. వృద్ధుడితో సహా ఆరుగురి అరెస్టు

చెన్నై/పెరంబూర్‌ : ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 75 ఏళ్ల వృద్ధుడు సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కన్నియకుమారి జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలిక కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్కడి దుకాణాల్లో భిక్షాటన చేస్తుంది. తనకు నగదు ఇస్తున్న కొందరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తన తండ్రితో చెప్పింది.


ఆ మాటలను ఆయన రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ శ్రీనాథ్‌ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కుళచ్చల్‌ మహిళా పోలీసులను ఆదేశించారు. విచారణ చేపట్టిన పోలీసులు, ఆ ప్రాంతంలో చిల్లర దుకాణం నడుపుతున్న మహమ్మద్‌ నూకు(75), స్టూడియో యజమాని సహాయదాసన్‌, జాకీర్‌హుస్సేన్‌, అబ్దుల్‌ జాఫర్‌, సహా 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలురను అరెస్టు చేశారు.

Updated Date - 2020-06-07T15:50:06+05:30 IST