Americaలో విషాదం.. పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఇంట్లో 5ఏళ్ల బాలుడి మృతి.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-22T23:03:58+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అన్నపుట్టిన పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు కుటుంబం సిద్ధం అవుతుండగా.. దురదృష్టవశాత్తు 5ఏళ్ల తమ్ముడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 5ఏ

Americaలో విషాదం.. పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఇంట్లో 5ఏళ్ల బాలుడి మృతి.. కారణం ఏంటంటే..

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అన్నపుట్టిన పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు కుటుంబం సిద్ధం అవుతుండగా.. దురదృష్టవశాత్తు 5ఏళ్ల తమ్ముడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 5ఏళ్ల చిన్నారిలాగా మరో చిన్నారి బలైపోవొద్దనే ఆలోచనతో.. తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టింది. కాగా.. ఇంతకూ ఆ బాలుడు ఎలా మృతి చెందాడు.. సోషల్ మీడియాలో పోలీసులు ఏం పోస్ట్ చేశారు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


టెక్సాస్‌కు చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు. ఇందులో ఒకరి వయసు ప్రస్తుతం 8ఏళ్లు కాగా.. మరొకరి వయసు 5ఏళ్లు. రెండు మూడు రోజుల్లో పెద్ద కొడుకు పుట్టిన రోజు ఉండటంతో.. జన్మదిన వేడకులను ఘనంగా నిర్వాహించాలని ఆ తల్లి భావించింది. ఈ క్రమంలో ఇద్దరు కొడుకులను వెంటపెట్టుకుని బయటికెళ్లింది. అనంతరం కొద్ది సమయానికి ఇంటికి తిరిగి చేరుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది. పెద్ద కుమారిడితోపాటు తన చిన్నకొడుకు కూడా కారు దిగి ఇంట్లోకి వచ్చేసి ఉంటాడని ఆమె భావించింది. అయితే చిన్న కొడుకు ఇంట్లోకి రాలేదని గ్రహించి.. వెంటనే కారు ఓపెన్ చేసి చూసింది. 



అందులో ఆ చిన్నారి స్పృహ లేకుండా పడి ఉండటాన్ని చూసి కంగారుపడింది. వెంటనే ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన అక్కడకు చేరుకున్న వైద్య సిబ్బంది.. కారులో హీట్ ఎక్కువ కావడంతో 5ఏళ్ల బాలుడు మరణించినట్టు వెల్లడించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ.. తన కొడుకు కార్ లాక్ ఓపెన్ చేసుకుని రావడం తెలసనీ.. ఎందుకు బయటకు రాలేకపోయాడో అర్థం కావడం లేదంటూ భావోద్వేగానికి గురైంది. 


ఈ సందర్భంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కారును అన్‌లాక్ ఎలా చేయాలి? అకస్మాత్తుగా కారులో చిక్కుకుంటే ఆ విషయాన్ని ఎలా తెలియజేయాలి అనే అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో వేసవి ప్రారంభమవడంతో.. ఊష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బయటి కంటే కారులో అధిక ఊష్ణోగ్రత ఉంటుందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అంటున్నారు. కాగా.. ఇలా కారులో చిక్కుకుని హీట్ స్ట్రోక్ వల్ల 1998 నుంచి ఇప్పటి వరకు దాదాపు 912 చిన్నారులు మరణించినట్టు సమాచారం.


Updated Date - 2022-06-22T23:03:58+05:30 IST