యూట్యూబ్ చూస్తూ స్పానిష్ నేర్చుకున్న బుడతడు

ABN , First Publish Date - 2021-07-06T22:11:43+05:30 IST

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెత ఆ బుడతడుకి సరిగ్గా సరిపోతుంది.

యూట్యూబ్ చూస్తూ స్పానిష్ నేర్చుకున్న బుడతడు

కేరళ: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెత ఆ బుడతడుకి సరిగ్గా సరిపోతుంది. వయసు ఐదేళ్లు.. యూట్యూబ్ చూస్తూ స్పానిష్ నేర్చుకున్నాడు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు నిత్యం యూట్యూబ్ చూసేవాడు. అలా చూస్తూ స్పానిష్ భాషపై పట్టు సాధించాడు. బాలుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ఆ బుడతడు మాట్లాడుతున్నది స్పానిష్ భాష అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. స్పానిష్‌లో ఇంకొంచెం శిక్షణ ఇస్తే ఈ బాలుడు అనర్గళంగా మాట్లాడే అవకాశముంది.

Updated Date - 2021-07-06T22:11:43+05:30 IST