వచ్చే నెల 29న 5జీ సేవలు ప్రారంభం!

ABN , First Publish Date - 2022-08-05T06:07:48+05:30 IST

దేశంలో 5జీ వాణిజ్య సేవలు వచ్చేనెల 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని సమాచారం. ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) 2022’

వచ్చే నెల 29న 5జీ సేవలు ప్రారంభం!

ఐఎంసీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరంభం!! 


న్యూఢిల్లీ: దేశంలో 5జీ వాణిజ్య సేవలు వచ్చేనెల 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని సమాచారం. ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) 2022’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 5జీ సేవలను ఆరంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న ఐఎంసీలో దేశీయ, అంతర్జాతీయ టెలికాం కంపెనీలు, వెండా ర్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీలు తమ 5జీ టెక్నాలజీలను ప్రదర్శించనున్నాయి. ఇంతకు ముందు ప్రణాళిక ప్రకారం..


స్వాత్రంత్య దినోత్సవం (ఆగష్టు 15) నాడు ప్రధాని ఎర్రకోట నుంచి 5జీ సేవలను ప్రారంభించాల్సింది. అయితే, కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపును ఈ నెల 12న చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. స్పెక్ట్రమ్‌ కేటాయించాక కంపెనీలు వాణిజ్య సేవల కు సిద్ధమయ్యేందుకు మరింత సమయం అవసరం. అందుకే ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. 

Updated Date - 2022-08-05T06:07:48+05:30 IST