ఒప్పో నుంచి 5జి స్మార్ట్‌ ఫోన్‌

ABN , First Publish Date - 2022-06-11T06:02:24+05:30 IST

మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌లను ఒప్పో వరుసగా బైటకు తెస్తోంది. తాజాగా ఒప్పో కె10 5జి మన దేశానికి వస్తోంది.

ఒప్పో నుంచి 5జి స్మార్ట్‌ ఫోన్‌

మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌లను ఒప్పో వరుసగా బైటకు తెస్తోంది. తాజాగా ఒప్పో కె10 5జి మన దేశానికి వస్తోంది. హెచ్‌డి, డిస్‌ప్లే, మీడియాటెక్‌ ప్రాసెసర్‌ పవర్‌ వంటి హంగులు ఉన్నాయి. ప్రధానంగా 5జీ ఎనేబిలింగ్‌ సామర్థ్యం ఉన్న ఫోన్‌ ఇది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. పగుళ్ళకు వీలుకాని విధంగా రిఫ్లక్టివ్‌ రేర్‌ పానెల్‌, స్ట్రెయిట్‌ ఎడ్జ్‌ డిజైన్‌తో వస్తోంది. దీని ధర రూ.17,499 కాగా మిడ్‌నైట్‌ బ్లాక్‌, ఓషన్‌ బ్లూ రంగుల్లో వస్తోంది.  ఈ నెల 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో స్టోర్ల నుంచి వీటిని పొందవచ్చు. ఎస్‌బీఐ, యాక్సిస్‌, కోటక్‌ మహీంద్రా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్డులతో రూ.1500 వరకు డిస్కౌంటు పొందవచ్చు. ముందే పేర్కొన్నట్టు హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లేకి తోడు 720 ్ఠ 1612 పిక్సల్‌ రిజల్యూషన్‌ ఉంది. డిస్‌ప్లే 90హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. 600 నిట్స్‌ మేరకు నిట్స్‌ బ్రైట్‌నెస్‌ దీని  సొంతం. ఇంటర్నల్‌ స్టోరేజీ 128 జీబీ. మైక్రో ఎస్‌డి కార్డు ఉపయోగించి దీన్ని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఈ స్మార్ట్‌ఫోన్‌ పనిచేస్తుంది. డ్యూయల్‌ రేర్‌ కెమెరా ఉంది. 8ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ముఖ్యంగా సెల్ఫీల కోసం ఏర్పాటు చేశారు.  ఐపీఎక్స్‌4 రేటింగ్‌ ఉంది. 500 ఎంఏహెచ్‌ బ్యాటరీ అదీ 33 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. 

Updated Date - 2022-06-11T06:02:24+05:30 IST