5G సేవలు అందించాలి

ABN , First Publish Date - 2020-03-12T06:16:04+05:30 IST

మనుషుల అవసరాలను రోబోలు తీరుస్తున్న ఆధునిక యుగం ఇది. డ్రైవర్ లేకుండానే కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వైద్యులు సుదూర ప్రాంతాల నుంచి శాస్త్ర చికిత్సలు నిర్వహించటం...

5G సేవలు అందించాలి

మనుషుల అవసరాలను రోబోలు తీరుస్తున్న ఆధునిక యుగం ఇది. డ్రైవర్ లేకుండానే కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వైద్యులు సుదూర ప్రాంతాల నుంచి  శాస్త్ర చికిత్సలు నిర్వహించటం వంటి ఐదో తరం 5జీ  సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే చైనా, జపాన్ తదితర దేశాలు ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. పలు దేశాల్లో ఆటోమేషన్ రంగం ఊపందుకుంది. భారత్ ఆ దిశగా కదులుతున్నది కానీ ఈ వేగం సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు మన దేశం 2024 సంవత్సరం నాటికి 5 లక్షల కోట్ల  డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే  సాంకేతిక రంగం పాత్ర కీలకం. కమ్యూనికేషన్ వ్యవస్థలో భారీ మార్పులు అవసరం. అందుకని 5జీని అందరికీ అందుబాటులోకి తేవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వేగంగా ముందుకు కదిలినప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యం.


– ఉప్పలపు శేషునాథ్, పి. నైనవరం

Updated Date - 2020-03-12T06:16:04+05:30 IST