13 పట్టణాల్లో 5జీ నెట్‌వర్క్‌

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

హైదరాబాద్‌ సహా 13 పట్టణాల్లో మొదట 5జీ నెట్‌వర్క్‌ సేవలు

13 పట్టణాల్లో 5జీ నెట్‌వర్క్‌

హైదరాబాద్‌ సహా 13 పట్టణాల్లో మొదట 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌కు తోడు గుర్గావ్‌, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చండీగఢ్‌, జామ్‌నగర్‌, అహ్మదాబాద్‌, ఢిల్లీ, లక్నో, చెన్నై, పుణె, గాంధీనగర్‌లో 5జీ నెట్‌వర్క్‌ మొదట అందుబాటులోకి వస్తుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ తెలిపింది. టీఎస్‌పీ(టెలికామ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌)లకు ప్రీక్వెన్సీలను అసైన్‌ చేసే ప్రక్రియను త్వరలో ఆరంభించినున్నట్టు కూడా పేర్కొంది.


ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌, ఐడియా ఇప్పటికే కొన్ని నగరాల్లో ట్రయల్స్‌ ఆరంభించాయి. స్పెక్ట్రమ్‌ వేలం విషయమై సూచనలు కోరుతూ ఇప్పటికే ట్రాయ్‌కి అభ్యర్థన కూడా వెళ్ళింది. టెలికామ్‌ నిధులతో సాగుతున్న దేశీయ 5జి టెస్ట్‌ బెడ్‌ ప్రాజెక్ట్‌ సైతం చివరి దశకు వచ్చింది. 2021 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన అభివృద్ధి నివేదికలో ఈ విషయాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ పొందుపరిచింది.   

Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST