58 స్థానిక సంస్థలకు ఎన్నికలు

ABN , First Publish Date - 2021-11-30T18:43:10+05:30 IST

రాష్ట్రంలో విధానపరిషత్‌ సమరం ముగియక ముందే మరో పోరు వచ్చేసింది. స్థానిక సంస్థల కోటాలో 25 పరిషత్‌ స్థానాలకు డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుండగా ఆ వెంటనే మినీ సంగ్రామం మెదలుకానుంది. రాష్ట్రంలోని

58 స్థానిక సంస్థలకు ఎన్నికలు

                    - డిసెంబరు 27న పోలింగ్‌ 


బెంగళూరు: రాష్ట్రంలో విధానపరిషత్‌ సమరం ముగియక ముందే మరో పోరు వచ్చేసింది. స్థానిక సంస్థల కోటాలో 25 పరిషత్‌ స్థానాలకు డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుండగా ఆ వెంటనే మినీ సంగ్రామం మెదలుకానుంది. రాష్ట్రంలోని 58 స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నగారా మోగించింది. డిసెంబరు 27న పోలింగ్‌ జరిగేలా నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. 2016లో ఎన్నికలు జరిగిన నగరపాలికె సంస్థలకు ఐదేళ్ల కాలవ్యవధి ముగిసింది. వార్డుల విభజనతో పాటు వాయిదా పడిన 58 స్థానిక సంస్థలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. 5 నగర సభ, 19 పురసభ, 34 పట్టణ పంచాయతీలకు సంబంధించి 1185 వార్డులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న నోటిఫికేషన్‌ జారీ కానుండగా నామినేషన్‌లు దాఖలుకు 15 దాకా గడువు ఉంది. 16న పరిశీలనలు, 18 వరకు ఉపసంహరణలకు గడువు ఉంది. డిసెంబరు 27న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు 30వ తేదీన ఉంటాయి. కొవిడ్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Updated Date - 2021-11-30T18:43:10+05:30 IST