Abn logo
May 13 2021 @ 22:23PM

భారత్‌కు సాయం పెంచాలంటూ బైడెన్‌కు 57 మంది నేతల లేఖ

వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్‌తో కొట్టుమిట్టాడుతున్న భారత దేశానికి అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్‌కు చేసే సాయాన్ని మరింత పెంచాలంటూ 57 మంది కాంగ్రెస్ నేతలు బైడెన్‌కు లేఖ రాశారు. ‘‘భారత్‌లో తాజాగా వెలుగు చూసిన కరోనా వ్యాప్తి మానవతా సంక్షోభం. దీన్నుంచి కోలుకోవాలంటే మన సహకారం చాలా అవసరం’’ అని ఆ లేఖలో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా కల్లోలంతో బాధపడుతున్న భారత్‌కు రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ జనరేటర్లు తదితర సాయం పంపాలని కాంగ్రెస్ నేతలు వైట్‌హౌస్‌ను కోరారు.

తాజా వార్తలుమరిన్ని...

Advertisement