56 రకాల నాట్య ముద్రలు, నవరస హావభావాలు

ABN , First Publish Date - 2022-06-15T15:58:03+05:30 IST

విరుదునగర్‌ జిల్లా కలెక్టర్‌ జె.మేఘనాధరెడ్డి మూడేళ్ల కుమార్తె నాట్య ముద్రలు, నవరసాల హావభావాలతో నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పుస్తకంలో స్థానం

56 రకాల నాట్య ముద్రలు, నవరస హావభావాలు

                       - నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కలెక్టర్‌ కుమార్తెకు స్థానం


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 14: విరుదునగర్‌ జిల్లా కలెక్టర్‌ జె.మేఘనాధరెడ్డి మూడేళ్ల కుమార్తె నాట్య ముద్రలు, నవరసాల హావభావాలతో నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పుస్తకంలో స్థానం సంపాదించుకుంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కుమార్తె మీరా అరవింద 56 రకాల నాట్య ముద్రలు, నవరసాలు తెలిపే హావభావాలు ప్రదర్శించారు. శిక్షకురాలు సెల్వరాణి పర్యవేక్షణలో సాగిన ఈ సాధన రికార్డ్‌ పుస్తకంలో చోటుచేసుకుంది. చిన్నారిని అభినందించిన నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్షిణ భారత డైరెక్టర్‌ దిలీపన్‌ చిన్నారికి సర్టిఫికెట్‌ అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మేఘనాధరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-15T15:58:03+05:30 IST