20వ అంతస్తు నుంచి కింద పడితే ఎవరైనా బతికి ఉంటారా..? కానీ ఓ మహిళ విషయంలో అద్భుతమే జరిగింది..!

ABN , First Publish Date - 2022-06-09T01:06:16+05:30 IST

20వ అంతస్తు నుంచి కిందపడిన వాళ్లు బతకడం దాదాపు అసాధ్యం. బాధితులు ఘటనా స్థలంలోనే మృతి చెందే అవకాశాలు ఎక్కువ.

20వ అంతస్తు నుంచి కింద పడితే ఎవరైనా బతికి ఉంటారా..? కానీ ఓ మహిళ విషయంలో అద్భుతమే జరిగింది..!

ఇంటర్నెట్ డెస్క్: 20వ అంతస్తు నుంచి కిందపడిన వాళ్లు బతకడం దాదాపు అసాధ్యం. బాధితులు ఘటనా స్థలంలోనే మృతి చెందే అవకాశాలు ఎక్కువ.  కానీ.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇంత ఎత్తు నుంచి పడినా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ‘ఇది నిజంగా అద్భుతం..’ అంటూ నోరెళ్లబెడుతున్నారు.  


స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 55 ఏళ్ల మహిళ ఒకరు కెలపా గేడింగ్ అనే ప్రాంతంలో ఉన్న  అపార్ట్‌మెంట్‌లో 20వ అంతస్తులో నివసిస్తుంటుంది. ఇటీవల ఓ రోజు ఆమె బాల్కనీలో దుస్తులు ఆరేస్తుండగా..బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఘటనాస్థలంలో ఉన్నవారు ఇదంతా చూసి ఒక్కసారిగా షాకైపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి.. భుజం ఎముక ఒకటి విరిగిందని చెప్పారు. అది మినహా ఆమెకు తీవ్రగాయాలేవీ కాలేదన్నారు. ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.కాగా..  కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆమె ఇటీవలే డిశ్చార్ అయింది. ప్రస్తుతం ఈ ఉదంతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది. 



Updated Date - 2022-06-09T01:06:16+05:30 IST