శ్రీనగర్: కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రగా 5.3గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాత్రి 7.01 గంటలకు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. కార్గిల్, లద్దాఖ్ ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వినిపించినట్టు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ప్రమాదం వాటిల్లినట్టు కానీ, ఆస్తి నష్టం జరిగినట్టు కానీ తెలియలేదు.
ఇవి కూడా చదవండి